Free wifi | Apsrtc | Aprli 1

Free wifi in apsrtc from aprli 1 in vennela garuda buses

wifi, apsrtc, free, garuda, vennela, garuda plus, thirupathi, vishakapatnam

free wifi in apsrtc from aprli 1 in vennela, garuda buses. free wifi will introduce to apsrtc shortly. in the garuda, vennala, garuda plus buses the wifi connection. the free wifi will commence from april 1.

ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ వైఫై.. ఏప్రిల్ 1 నుండి

Posted: 03/28/2015 10:13 AM IST
Free wifi in apsrtc from aprli 1 in vennela garuda buses

ప్రయాణాలు అంటేనే చాలా మందికి బోర్.. ఇంకా ఎంత సేపురా బాబు అంటే లోలోపల గునుక్కుంటారు. అయితే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే కొంత టైంపాస్ అవుతుంది. కానీ స్మార్ట్ ఫోన్ ఉన్నా నెట్ వర్క్ సరిగా ఉండక పోవడంతో ఇంటర్నెట్ వాడరు చాలా మంది. తాజాగా రైల్వేల్లో ఫ్రీ వైఫై కాన్సెప్ట్ ను ప్రారంభించింది. దాంతో రైల్వే ప్రయాణికుల్లో ఆనందం వచ్చింది. కానీ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి అందుబాటులో లేకపోవడంతో కాస్త నిరాశ చెందారు. కానీ ఇక ఆర్టీసీ బస్సుల్లోనూ ఫ్రీ వైఫై అని అందుబాటులోకి తీసుకువస్తూ ఏపియస్ ఆర్టీసీ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ లో ఫ్రీ వైఫై వివరాలు మీ కోసం..

ఏపియస్ ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో వైఫైకి ఏపి సర్కార్ శ్రీకారం చుట్టనుంది. ఏప్రిల్ 1 నుండి ఇంట్రానెట్ వైఫై సౌకర్యం ఏపిఎస్ ఆర్టీసీ బస్సుల్లో అందుబాటెలోకి రానుంది. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు వంటి మేజర్ నగరాలకు ప్రయాణం సాగించే బస్సుల్లో ఈ సౌలభ్యం అందుతుంది. తరువాత గుంటూరు,తిరుపతి, విశాఖ కేంద్రాలుగా నడిచే బస్సులకు విస్తరిస్తారు. వెన్నెల, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో అందుబాటులోకి. రానుంది. ప్రయాణం మొదలైనప్పటి నుండి గంటపాటు ఫ్రీ వైఫై వినియోగించుకోవచ్చు, కానీ తరువాత కేవలం 10 రూపాయలు చెల్లిస్తు చాలు ఎంత సేపైనా వైఫైని వినియోగించుకోవచ్చు. వైఫై కోసం బస్సులో ఓ కంప్యూటర్, వైఫై పరికరం అందుబాటులో ఉంచుతారు. ఈ కంప్యూటర్ లో 50 సినిమాలు, 400 వీడియో పాటలు అందుబాటులో ఉంచుతారు. వీటిని వారివారి ల్యాప్ ట్యాప్ లలో, స్మార్ట్ ఫోన్స్ లో వీక్షించేందకు అవకాశం లభిస్తుంది. మొత్తానికి నిన్నటి దాకా బస్సు ప్రయాణాలు అంటే బోర్ గా ఫీలయ్యే వారు జాలీగా ప్రయాణానికి సిద్దం కావచ్చు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : wifi  apsrtc  free  garuda  vennela  garuda plus  thirupathi  vishakapatnam  

Other Articles