chandrababu naidu | ap capital city master plan | singapore government

Chandrababu naidu master plan on ap capital city with singapore government

chandrababu naidu, chandrababu naidu latest news, chandrababu naidu updates, chandrababu naidu gossips, chandrababu naidu singapore tour, chandrababu naidu ap capital city, chandrababu singapore government, ap capital city controversy, guntur city news, vijayawada city news, singapore minister eswaran

chandrababu naidu master plan on ap capital city with singapore government : Andhra Pradesh Chief Minister Making A Master Plan with Singapore Government on AP Capital city. They Decided to start this project from june after completion of this plan.

ఏపీ రాజధానిపై బాబు తుది ‘మాస్టర్ ప్లాన్’

Posted: 03/31/2015 11:34 AM IST
Chandrababu naidu master plan on ap capital city with singapore government

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ ప్రతినిధులతో చర్చలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే! ఈ విషయంపై గతేడాది నుంచి జరుగుతున్న చర్చల్లో భాగంగానే బాబు సింగపూర్ కి నిత్యం పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇటీవలే ఆ దేశ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే రాజధానిపై ‘మాస్టర్ ప్లాన్’ దాదాపుగా సిద్ధమైందని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

ఏపీ నూతన రాజధానిపై బాబు ఆ దేశ ప్రతినిధులతో తుదిమెరుగులు దిద్దారు. ఆయనిచ్చిన సూచనలమేరకు జూన్ నాటికి రాజధాని నిర్మాణానికి సంబంధించి బృహత్తర ప్రణాళికను సింగపూర్ సిద్ధం చేయనుంది. సీఆర్డీఏ పరిధికి సంబంధించి ఔట్ లైన్ ప్లాన్‌ను సీఎంకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అందజేశారు. కేపిటల్ మాస్టర్ ప్లాన్‌పై స్పష్టత ఇచ్చిన ఆయన.. మూడు దశల్లో ప్రణాళిక ఇస్తామని.. రెండో దశ కింద రాజధాని సిటీ ప్లాన్‌ను తయారు చేస్తామని చెప్పారు. క్యాపిటల్ సిటీ నిర్మాణంలో భాగంగా భూమిని ఎలా ఉపయోగించుకోవాలి, పరిపాలన భవనాలు, వాణిజ్య సముదాయాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశాలపై రెండో దశలో స్పష్టత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారని సమాచారం!

అయితే.. సింగపూర్ సర్కార్ తయారు చేసిన ఈ ఔట్ లైన్ ప్లాన్‌కు చంద్రబాబు కొన్ని మార్పులు సూచించారని తెలిసింది. రాజధాని ప్రాంతానికి రెండు రింగురోడ్ల నిర్మాణంతోపాటు చుట్టుపక్కల పట్టణాల్ని కూడా రాజధానికి అనుసంధించాలని తెలిపారట! దీంతో ఆయన చేసిన మార్పులతో కూడిన పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్‌ను మరో 2 నెలల్లో అందించడానికి సింగపూర్ ప్రతినిధులు అంగీకరించారు. ఏపీ రాజధానిపై 90శాతం మాస్టర్ ప్లాన్‌ పూర్తవడంపై బాబు సంతృప్తి వ్యక్తంచేశారు. త్వరలోనే ఏర్పాటు కానున్న ఈ ప్లాన్ లో భాగంగా ఏపీ మంత్రులకు రాజధాని విషయంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  ap capital city master plan  singapore minister eswaran  

Other Articles