Kolkata Knight Riders | BCCI | Sunil Narine

Big fight between bcci and kolkata knight riders

bcci news, Kolkata Knight Riders, west indies bowler sunil narine, sunil narine news, sunil narine updates, sunil narine gossips, Kolkata Knight Riders team members, Kolkata Knight Riders cricketers, bcci management, Kolkata Knight Riders officials, bcci officials, sunil narine controversy

big fight between bcci and kolkata knight riders : A big fight held between BCCI and defending champion Kolkata Knight Riders for west indies bowler sunil narine.

ఆ బౌలర్ కోసం గొడవపడుతున్న బీసీసీఐ, కోల్ కతా నైట్ రైడర్స్!

Posted: 03/31/2015 12:07 PM IST
Big fight between bcci and kolkata knight riders

ప్రపంచవ్యాప్తంగా వుండే క్రికెట్ అభిమానులు ఎంతగానో వేచిచూస్తున్న ఐపీఎల్ సీజన్ రానే వచ్చింది. మరికొన్నిరోజుల్లో ప్రారంభంకానున్న ఈ పోరుకోసం ఇప్పటికే ఆయా జట్లు సిద్ధంగా వున్నాయి. అలాగే బీసీసీఐ ఈ సీజన్ కి సంబంధించిన షెడ్యూల్ కూడా రెడీ చేసేసింది. అంతా సవ్యంగానే జరుగుతున్న నేపథ్యంలో... ఓ బౌలర్ వ్యవహారంలో బీసీసీఐ, డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య బిగ్ ఫైట్ జరుగుతోందని సమాచారం! వీరిమధ్య ఈ గొడవ ఏ స్థాయికి చేరిందంటే... తన మాట నెగ్గకపోతే బరి నుంచి తప్పుకునేందుకు కూడా వెనుకాడేదిలేదంటూ కోల్ కతా నైట్ రైడర్స్ తేల్చి చెప్పిందట!

అసలు విషయం ఏమిటంటే.. తన స్వింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్లను చెమటలు పట్టించే వెస్టిండీస్ మిస్టరీ బౌలర్ సునీల్ నరైన్ ను కోల్ కతా జట్టు కొనుగోలు చేసింది విషయం తెలిసిందే! అయితే.. బౌలింగ్ లో వివాదాస్పద యాక్షన్ నేపథ్యంలో నరైన్ పై ఐసీసీ గతకొన్నాళ్ల క్రింద నిషేధం విధించింది. ఈ క్రమంలోనే నరైన్.. నిబంధనలకు అనుగుణంగా తన యాక్షన్ మార్చుకోవడంతో అతనిపై వున్న నిషేధాన్ని ఐసీసీ ఎత్తివేసింది. కానీ.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో భాగంగా కోల్ కతా జట్టులో నరైన్ ను ఆడించే విషయంలో బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోసారి అతడు పరీక్షలకు హాజరు కావాల్సిందేనని బీసీసీఐ యాజమాన్యం ఆర్డర్ చేస్తోంది.

ఈ వ్యవహారంపై చర్చించేందుకు కోల్ కతా నైట్ రైడర్స్ ప్రతినిధి యాజమాన్యం, బీసీసీఐ చీఫ్ జగ్ మోహన్ దాల్మియాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగానే నరైన్ అంశాన్ని ప్రస్తావించిన కోల్ కతా జట్టు ప్రతినిధి.. నరైన్ ను ఆడేందుకు అనుమతించాల్సిందేనని డిమాండ్ చేశారట! అయితే.. అతని యాక్షన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బీసీసీఐ.. అతడిని పరీక్షించాల్సిందేనని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే నరైన్ ను ఆడించని పక్షలో తాము బరి నుంచి తప్పుకోవడానికైనా సిద్ధంగా వున్నామని కోల్ కతా జట్టు తేల్చి చెప్పాంది. మరి.. దీనిపై బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kolkata Knight Riders  BCCI Management  Sunil Narine  IPL Seasons  

Other Articles