April | Fools | Day

April fools day is celebrated every year on the first day of april

april, fools, day, celebrations, europe, canada, brazil, us

April Fools' Day (sometimes called April Fool's Day or All Fools' Day) is celebrated every year on the first day of April as a day when people play practical jokes and hoaxes on each other. The jokes and their victims are known as "April fools". Hoax stories may be reported by the press and other media on this day and explained on subsequent days. Popular since the 19th century, the day is not a national holiday in any country

ప్రత్యేకం: హ్యాపీ ఏప్రిల్ ఫూల్స్ డే.. విశేషాలు

Posted: 04/01/2015 08:23 AM IST
April fools day is celebrated every year on the first day of april

ఆడ, మగ తేడాలు మరచి, జాతి, మత, ప్రాంతీయ, వయో భేదాలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా సరదాలు పంచుకుని మనసారా నవ్వుకునే సందర్భం- ‘ఆల్ ఫూల్స్ డే’. ఏటా ఏప్రిల్ 1న జరుపుకునే ఈ సరదా పండగ వెనక పెద్ద చరిత్రే ఉంది. మొదట యూరప్‌లో ప్రారంభమైన ‘ఆల్ ఫూల్స్ డే’ వేడుకలు ఆ తర్వాత అనేక దేశాల్లో పాటించడం ఆనవాయతీగా మారింది. పాత రోమన్ కేలండర్ ప్రకారం వసంత రుతువు ఏప్రిల్ 1న ప్రారంభయ్యేదట. క్రీ.పూ. 154కు ముందు ఏప్రిల్ ఒకటో తేదీని కొత్త సంవత్సరంగా పరిగణించి కోలాహలంగా జరుపుకునేవారు. పదహారో శతాబ్దం వరకూ యూరప్‌లో ఏప్రిల్ ఫస్ట్‌నే కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభమై పది రోజుల పాటు ఘనంగా నిర్వహించేవారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా పరస్పరం బహుమతులు ఇచ్చి పుచ్చుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకునేవారు.

1582లో ఫ్రాన్స్ రాజైన చార్లెస్‌కి అంతవరకూ ఉన్న కేలండర్‌ని మార్చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే కేలండర్‌ను మార్చేసి, గ్రిగేరియన్ కేలండర్‌ని అనుసరించాలని ఆదేశాలు జారీ చేశాడు. మారిన కేలండర్ ప్రకారం జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని రాజుగారు ఇచ్చిన ఆదేశాలను చాలామంది ఆచరించడం మొదలుపెట్టారు. సమాచార వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో ఆ వార్త దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలందరికీ సకాలంలో చేరలేదు. రాజధానికి దూరంగా ఉన్న ప్రాంతాలకు- జనవరి 1న కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవాలనే సమాచారం చేరలేదు. ఈలోగా మరో ఏడాది వచ్చేసింది. సమాచారం తెలియని వారు మాత్రం యథా ప్రకారం ఏప్రిల్ ఫస్ట్‌న కొత్త సంవత్సరం సంబరాలు జరుపుకున్నారు. మొదటి నుండి వస్తున్న ఆచారాన్ని మార్చడానికి కొందరు ఇష్టపడలేదు. దాంతో వాళ్ళు ఏప్రిల్ 1 వరకు వేచి ఉండి అప్పుడు వేడుకలు జరుపుకున్నారు. పాత అలవాటు మానుకోలేక ఏప్రిల్ ఒకటిన బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం మాత్రం మానుకోలేకపోయారు. అందుకని వాళ్లని ఎగతాళి చేస్తూ మిగతావారు ‘ఏప్రిల్ ఫూల్స్’ అనేవారు. కాగితంతో తయారుచేసిన చేపలను వారి వెనుక భాగాన కట్టి ఆట పట్టించేవారట. వాళ్లని గేలానికి తేలిగ్గా చిక్కే చేపలకింద జమ కట్టి ‘ఏప్రిల్ ఫిష్’ అంటూ అల్లరి చేసేవారట. కాలగతిలో అది ‘ఏప్రిల్ ఫూల్స్’గా వాడుకలోకి వచ్చింది. ఇలా ప్రారంభమైన ‘్ఫల్స్ డే’ మరో రెండు వందల ఏళ్ల నాటికి అమెరికా, బ్రిటన్, స్కాట్లాండ్ తదితర దేశాలకు, అక్కడి నుంచి మిగిలిన దేశాలకు పాకింది. ఒకరిపై మరొకరు జోకులు వేసుకోవడం, అందమైన అబద్ధాలతో ఆట పట్టించడం మొదలైంది.

ఫ్రాన్స్‌లో ఏప్రిల్ ఒకటో తేదీని ‘పాయిజిన్ డెవిల్’ అని వ్యవహరిస్తారు. పిల్లలు తమ స్నేహితుల వెనుక భాగాన కాగితపు చేపలను కట్టి ఆటపట్టిస్తుంటారు. స్కాట్‌లాండ్‌లో రెండు రోజుల పాటు ఈ వేడుకలు జరుపుకుంటారు. రెండో రోజును ‘టైలీ డే’ అని అంటారు. ఇటలీ, ఫ్రాన్స్, బెల్జియంలో ఏప్రిల్ ఫూల్‌ను ‘ఏఫ్రిల్ ఫిష్’ అని పిలుస్తారు. స్కాట్‌లాండ్‌లోని కొన్ని ప్రాంతాలలో ‘నెంబర్ వన్ ఫూల్’ పోటీలు జరుగుతాయి. బాగా ఫూల్ అయిన వ్యక్తికి ‘నెంబర్ వన్ ఫూల్’ టైటిల్‌ను ప్రదానం చేస్తారు.

ఫూల్స్‌డే సంస్కృతి మన దేశంలోనూ బాగానే ఊపందుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం అత్యంత సరదాగా చేసుకుంటున్నారు. చిలిపి చేష్టలతో నవ్వించడమే ఈ వేడుక ఉద్దేశం. హాస్యం పేరిట అల్లరి శ్రుతి మించుతున్న సందర్భాలు కూడా ఎదురవుతుంటాయ. మాటలతో, చేష్టలతో ఎదుటివారిని అతిగా గేలి చేయడం, వారు బాధపడడం, ఫలితంగా మానవ సంబంధాలు దెబ్బతినడం వంటి సంఘటనలు మనం చూస్తుంటాం. ప్రాక్టికల్ జోకులు ఎంతవరకూ వెళుతున్నాయంటే- ఒకోసారి నిజం చెప్పినా నమ్మని విధంగా ఉంటాయ. అందుకే- ఏ సరదా అయినా హద్దుల్లో ఉంటే అందరికీ ఆనం దదాయకమే.

ఒకప్పుడు ఫ్రాన్స్‌లో ఏప్రిల్ ఫస్ట్‌న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేవారు. 1582లో రాజైన చార్లెస్-9 కేలెండెర్‌ని మార్చేసి జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు. అయితే సమాచర వ్యవస్థ అంతగా వృద్ధి చెందని ఆ కాలంలో ఆ వార్త దేశంలోని ప్రజలందరికీ త్వరగా చేరలేదు. రాజధానికి దగ్గర్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే చేరింది. ఈలోగా మళ్ళీ కొత్త ఏడాది వచ్చేసింది. రాజాజ్ఞ తెలిసిన కొందరు జనవరి ఫస్ట్‌న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కొందరు మాత్రం మొదటినుంచీ వస్తున్న ఆచారాన్ని మార్చడానికి ఇష్టపడక జరుపుకోలేదు. వాళ్ళు మాత్రం యదావిధిగా ఏప్రిల్ 1 వరకు ఆగి ఆ రోజు మాత్రమే కొత్త సంవత్సర వేడుకల్ని జరుపుకున్నారు. జనవరి ఫస్ట్‌న జరుపుకున్న వారు ఇది చూసి, ఏప్రిల్ ఫస్ట్‌న జరుపుకున్న వారిని ఫూల్స్ అని పేర్కొంటూ గేలి చేసేవారు. వాళ్ళకి తెలీకుండా పేపర్ చేపల్ని వాళ్ళ వెనక భాగాన కట్టి ఆటపట్టించేవారు. అంతేకాకుండా వాళ్ళని గేలానికి చాలా తేలిగ్గా తెలివితక్కువతనంతో దొరికిపోయే చేపలక్రింద జమకట్టి, వాళ్ళని ఏప్రిల్ ఫిష్ అంటూ అల్లరి పెట్టేవారు.

ఈ ఆటపట్టించే విధానం ఏప్రిల్ ఫూల్స్ డేగా మరో రెండు వందల ఏళ్ళకల్లా అమెరికా, బ్రిటన్, స్కాట్లండ్ తదితర దేశాలకు తెలిసిపోయింది. అలా ప్రపంచమంతా ప్రాకిపోయింది. ఒకరిపై మరొకరు ఎన్నో రకాల జోక్స్ వేసుకోవడం ఆనవాయితీ అయ్యింది. అది రాన్రానూ ప్రాక్టికల్ జోక్స్ చేసుకునే స్థాయికివెళ్ళింది. ఈ ప్రాక్టికల్ జోక్స్ మొదట్లో సున్నితంగా ఉన్నా, అప్పుడప్పుడు కాస్త శ్రుతి మించడం జరుగుతూ ఉంది. ఏది ఎమైనా సరదాగా, సంతోషంగా జరుపుకునే ఈ వేడుక మన దేశంలోనూ మారుమూల గ్రామాల్లోనూ జరుపుకుంటుండడం విశేషం.

 

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : april  fools  day  celebrations  europe  canada  brazil  us  

Other Articles