మొబైల్ వినియోగదారులకు కాల్ ఛార్జీల మోత మోగనుంది. స్పెక్ట్రమ్ వేలం నేపథ్యంలో భారీగా చెల్లించి అనుమతులు పొందిన కంపెనీలు తమ భారాన్ని భర్తీ చేసుకోవడానికి ఛార్జీలు పెంచే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. మొబైల్ కాల్ రేట్లు, సేవల చార్జీలు 12 నుంచి 15 శాతం పెరిగే అవకాశం కనిపిస్తోంది. వేల కోట్ల రూపాయలతో స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసిన కంపెనీలు ఆ భారాన్ని తట్టుకోవాలంటే ఈ భారాన్ని మోపక తప్పదని ద సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కాల్ రేట్లు పెరిగే అవకాశం ఉందంటూ టెలికం కంపెనీలు చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సెక్రటరీ రాకేష్ గార్గ్ చేసిన విశ్లేషించారు.స్పెక్ట్రమ్ కొనుగోళ్ల కాలపరిమితి 20 ఏళ్ల వరకూ ఉంటుంది. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటే టెలికం కంపెనీలకు ఏడాదికి సగటున 5300 కోట్లకు మించి ఖర్చు కాదని, ఈ భారాన్ని తట్టుకునేందుకు ఆ కంపెనీలు ప్రస్తుతం ఉన్న కాల్‌రేట్లపైన నిమిషానికి రూపాయి ముప్పై పైసలు చొప్పున పెంచితే సరిపోతుందని రవిశంకర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
అయితే ఛార్జీల పెంపుకు సహేతుక కారణాలున్నాయని మొబైల్ ఆపరేటర్లు వాదిస్తున్నారు. వేలం దెబ్బకు తమపై పడిన భారాన్ని తట్టుకోవాలంటే.. ప్రస్తుత టారిఫ్‌లపై 12 నుంచి 15 శాతానికి పైగా పెంపు తప్పదన్నదిద సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొన్నది. ద్రవ్యోల్బణం, స్పెక్ట్రం అధిక ధరలు, పరికరాలకు అయ్యే అధిక వ్యయం, ఇతర ఖర్చులు.. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే రూపాయి ముప్పై పైసల పెంపు సెల్‌ఫోన్ ఆపరేటర్ల కష్టాలను ఎలా తీరుస్తుందో అర్థం కావట్లేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పరికరాల కొనుగోళ్లకు తాము ఇప్పటికే ఏటా 700 నుంచి 800 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నామని.. గతంలో కన్నా అనుమతులకు చట్టాలు మార్పులు వచ్చిన నేపథ్యంలో ఈ ఖర్చు ఇంకా భారీగా పెరగబోతోందని పేర్కొంది. టెలికం ఆపరేటర్లు ఇప్పటకే ఏటా తమ ఆదాయంలో 13-14 శాతం మేర లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీల కింద ప్రభుత్వానికి చెల్లిస్తున్నట్టు గుర్తుచేసింది. ఒకవైపు తమ ఖర్చులు ఇంత భారీస్థాయిలో ఉండగా.. ఆదాయం చూస్తే సగటున ఒక వినియోగదారుడి నుంచి వస్తున్న ఆదాయం కేవలం 2.96 డాలర్లు మాత్రమేనని, అంతర్జాతీయంగా ఈ సగటు 35 నుంచి 40 డాలర్ల దాకా ఉందని తెలిపింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో చార్జీలు పెంచకుండా ఉంటే తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. మరి గతంలో మొబైల్ ఛార్జీల్లో ఎలాంటి మార్పులు ఉండవని ప్రకటించిన టెలికాం మంత్రి దీనిపై ఎలాంటి చర్యలకు దిగుతారో చూడాలి. మరి పెరిగిన మొబైల్ ఛార్జీలను భరించడానికి వినియోగదారులు సిద్దంగా ఉండాలని విశ్లేషకులు ముందే హెచ్చరిస్తున్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more