తెలుగులో గోపాల గోపాల సినిమా లో వెంకటేష్ దుకాణం భూకంపంలో కూలిపోతుంది. కానీ షాప్ కు ఇన్సూరెన్స్ ఉంటుంది. అయితే భూకంపం వల్ల కూలిపోతే అది ఇన్సూరెన్స్ కు అర్హత కాదని తరువాత తెలుస్తుంది. దాంతో వెంకటేష్ కోర్టుకు వెళ్లి అక్కడ చివరకు విజయాన్ని సాధిస్తాడు. సినిమాలో అయితే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయా అంటే అవుననే చెప్పొచ్చు. అచ్చంగా తెలుగు సినిమాలో లాగానే ఇన్సూరెన్స్ చేయించుకున్న వ్యక్తికి చెల్లదని కంపెనీ చేతులెత్తింది. అయితే సునామీ వల్ల నష్టపోయిన తమకు ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించాలని క్రిష్ణపట్నం పోర్టు కోర్టును ఆశ్రయించింది. మరి కోర్టు తీర్పు ఎలా ఉంటుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
క్రిష్ణపట్నం పోర్ట్ ప్రమాదాలు జరుగుతాయని ముందు జాగ్రత్తగా 15 కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ చేయించింది. అయితే 2014లో వచ్చిన సునామీ కారణంగా పోర్టుకు తీవ్ర నష్టం వచ్చింది. అయితే అంతకు ముందే ఇన్సూరెన్స్ ఉంది కనుక కంపెనీకి విషయాన్ని అందించింది. అయితే సమాచారం అందుకున్న ఇన్సూరెన్స్ కంపెనీ అన్ని వివరాలను సేకరించి చివరకు ఇన్సూరెన్స్ చెల్లించడం లేదంటూ చేతులెత్తింది. ఇంతకీ ఎందుకు చెల్లించడానికి ముందుకు రావడం లేదని ప్రశ్నిస్తే.. ఇన్సూరెన్స్ పాలసీలో భూకంపం వస్తే పాలసీ వర్తిస్తుందని కానీ సునామీ పాలసీ పరిధిలో లేదని కంపెనీ అంటోంది. దాంతో ఖంగుతిన్న క్రిష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఇన్సూరెన్స్ కంపెనీపై కోర్టులో పోరాడాలని నిర్ణయించుకుంది.
ఎంతకీ ఇన్సూరెన్స్ కంపెనీ ముందుకు రాకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లింది క్రిష్ణపట్నం పోర్ట్ యాజమాన్యం. అసలు సునామీకి కారణం సముద్రంలో వచ్చే భూకంపమే కనుక తమకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని, సదరు ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ డబ్బులను చెల్లించాలని కోరింది. అయితే పోర్టు వాదనలో నిజముంది. శాస్ర్తవేత్తలు కూడా సునామీకి కారణం భూకంపమే అని నిర్దారించారు. కాగా కేవలం భూకంపం వల్ల కలిగే నష్టానికి మాత్రమే పాలసీ వర్తిస్తుందని ఇన్సూరెన్స్ కంపెనీ వాదిస్తోంది. మరి సుప్రీంకోర్టు రెండు పక్షాల వాదనను విన్న తరువాత ఎలాంటి తీర్పును వెలువడిస్తుందో చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more