Telangana | Tax | Mahinderreddy

Telangana transport minister said that ts except tax for ap on bifercation sentiment

telangana, transport, mahinderreddy, tax, entry tax, ap

telangana transport minister said that ts except tax for ap on bifercation sentiment. telangana transport minister mahinderreddy said that ts govt hold the orders for last few months because the ap govt facing several problems.

ఓహో.. అప్పుడే వేసేవాళ్లం ట్యాక్సు కానీ...

Posted: 04/01/2015 11:18 AM IST
Telangana transport minister said that ts except tax for ap on bifercation sentiment

తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త వివాదానికి తెర తీసిన ఎంట్రీ ట్యాక్స్ వివాదం ముదురుతోంది. తెలంగాణ లోకి ప్రవేశించే ఆంధ్రప్రదేశ్ వాహనాలపై ట్యాక్స్ వసూలుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే తెలంగాణకు నిత్యం రాకపోకలు సాగించే లారీలు, ప్రైవేట్ బస్సులకు తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉండటంతో అందరిలో ఆందోళన మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లారీల యూనియన్, ప్రైవేట్ ట్రావెల్ యూనియన్ నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. అయితే ఏపి ప్రభుత్వం ఏకంగా న్యాయపోరాటానికి సిద్దపడుతోంది.

అయితే తెలంగాణ ప్రభుత్వం వాదన మాత్రం మరోలా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఇప్పటి దాకా పోనీలే అని వదిలేసిందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఏపి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అని, ఇప్పటి దాకా ట్యాక్స్ వదిలేశామని ఆయన అన్నారు. నిబంధనల ప్రకారమే ఏపీ వాహనాలపై రోడ్ టాక్స్ విధించినట్లు మహేందర్ రెడ్డి చెప్పారు. ఏపీ అధికారుల వల్లే ఆలస్యమైందన్నారు. రాష్ట్రం విడిపోయినందువల్లే అక్కడి వాహనాలపై పన్ను విధిస్తున్నట్లు ఆయన తెలిపారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  transport  mahinderreddy  tax  entry tax  ap  

Other Articles