Ghar wapsi programme damage narendra modi image | India Today-CICERO poll

India today cicero poll narendra modi ghar wapsi

India Today-CICERO poll, narendra modi news, ghar wapsi programme, narendra modi controversy, ghar wapsi controversy, India Today-CICERO survey, bjp party controversy, rss party controversy, amit shah controversy

India Today-CICERO poll narendra modi ghar wapsi : According to the India Today-CICERO poll.. Ghar wapsi programme damage the image of prime minister narendra modi.

‘మోడీ’ స్వరానికి తీగలు తెంపేసిన ‘ఘర్ వాపసీ’

Posted: 04/03/2015 01:13 PM IST
India today cicero poll narendra modi ghar wapsi

ఇతర మతాలను అనుసరిస్తున్న హిందువులు తిరిగి హిందూమతంలోకి రావాలన్న ఉద్దేశంతో ‘ఘర్ వాపసీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే! అయితే ఈ మతమార్పిడిపై దేశవ్యాప్తంగా పెద్దయెత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. మోడీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత దేశంలో పురుడు పోసుకున్న ఈ కార్యక్రమం.. ఆయన కీర్తిని తగ్గించింది. తమకు అన్ని మతాలు ఒకటేనన్న మోడీ అధికారంలో ఇటువంటి కార్యక్రమం వచ్చినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేందంటూ విమర్శలొచ్చాయి. ఈ ఘర్ వాపసీ మోడీని క్రిందకు దిగజార్చేసిందని ఓ సర్వే తాజాగా నిగ్గు తేల్చింది.

అధికారం చేపట్టి పదినెలలు ముగిసిన సందర్భంగా మోడీ ప్రభుత్వంపై ఇండియా టుడే-సిసిరో ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగానే ఘర్ వాపసీ మోడీ ఇమేజ్ ని పూర్తిగా డ్యామేజ్ చేసినట్లు వెల్లడైంది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్లలో... ఘర్ వాసపీ 27 సీట్లకు గండికొట్టేంత పెనుముప్పుగా మారింది. ఈ సర్వేలో మొత్తం 12 వేలమంది పాలుపంచుకుంటే అందులో నిజాయితీపరుడిగా దేశంలోనే మోడీ అగ్రస్థానంలో నిలిచారు కానీ.. 2014 ఆగస్టుతో పోల్చుకుంటే ఆయన వ్యక్తిగత పాపులారిటీ భారీగా దెబ్బతింది. దీనికి ఘర్ వాపసీయే కారణమని ఆ సర్వే తేల్చి చెప్పింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India Today-CICERO poll  narendra modi  ghar wapsi  

Other Articles