ఇటీవలే హైదరాబాద్ హైకోర్టు ఇచ్చిన కౌంటర్ కి తెలంగాణ సీఎం కేసీఆర్ GHMC ఎన్నికలపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలు నిర్వహించేందుకు తమకు 249 రోజుల గడవు కావాలంటూ టీ-సర్కార్ పిటీషన్ లో పేర్కొనగా.. అంత సమయం ఇచ్చేందుకు వీలుకాదని కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే! దీంతో ఈ ఎన్నికలను త్వరగా నిర్వహించే దిశగా టీ-ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతోందని తెలిసింది.
ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఈ ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారు. నిన్నటివరకు ఈ విషయంపై నోరుమెదపని ఆయన.. ఇప్పుడు చకచకా పనులు కానిచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ రూపంలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలిన నేపథ్యంలో.. ఈసారి జరగబోయే GHMC ఎలక్షన్లో ఎట్టిపరిస్థితుల్లోనైనా గెలుపొందాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇప్పటికే మంత్రులను అలర్ట్ చేశారని, కొందరు మంత్రులకు పలు ప్రాంతాల్లో బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం అందుతోంది. ముందునుంచి హైదరాబాద్ పై పట్టులేని టీఆర్ఎస్.. కనీసం ఈ ఎన్నికల తర్వాతైనా పాగా వేయాలని యోచిస్తోంది. మరి.. కేసీఆర్ అనుకున్నట్లుగా ఈ ఎన్నికల్లో ‘బాద్ షా’గా నిలుస్తారో లేదో వేచి చూడాల్సిందే!
ఇదిలావుండగా.. ఈ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు గ్రేటర్ బాధ్యతలు అప్పగించారు. అలాగే గ్రేటర్ పరిధిలో ఐదుగురు మంత్రులకు పూర్తి బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ శివారు ప్రాంత నియోజకవర్గాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టి పెట్టనున్నారు. ఈ ఎన్నికల కోసం మంత్రి హరీష్ రావు ఓ మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more