తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంట్ పెంచనున్న విషయం తెలిసిందే! ఇప్పటికే ఈ మేరకు ఆదేశాలు జారీ అయిపొయ్యాయి కూడా! అయితే.. వీరిలా ఒక్కసారిగా ఫిట్ మెంట్ పెంచడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఇబ్బంది పెట్టడానికే ఉద్యోగులకు ఫిట్ మెంట్ పెంచారని ఆయన తెలిపారు. తిరుపతిలో ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడిన చంద్రబాబు.. ఈ క్రమంలోనే ఫిట్ మెంట్ విషయాన్ని గుర్తుచేశారు.
ఈ నేపథ్యంలోనే బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇష్టారీతిగా రాష్ట్రాన్ని విభజించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో నడుస్తోందని, ఈ సమయాన్ని చూసుకుని ఉద్యోగులకు తాయిలాలు ప్రకటించారని ఆయన చెప్పారు. అయితే.. రాష్ట్ర పునర్విభజన సమయంలో ఏపీ ఎన్జీవోలు చేసిన పోరాటాన్ని దృష్టిలో వుంచుకుని, ఇబ్బందుల్లో వున్నప్పటికీ ఉద్యోగులకు తానున్నానన్న భరోసా కల్పించేందుకు తాను కూడా 42 శాతం ఫిట్ మెంట్ పెంచానని చెప్పిన బాబు.. తనను ఎవరూ ఇబ్బంది పెట్టలేరని నిరూపించానని తెలిపారు. ఉద్యోగుల సహకారంతో రాష్ట్రాన్ని అద్భుత రీతిలో నిర్మించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
అలాగే.. ప్రభుత్వ ఉద్యోగులు చెట్ల కింద కూర్చొని పనిచేయలేరని, వారితో కలిసి తాను రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. టెక్నాలజీని వినియోగించి ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తామన్నారు. వీలైన చోటల్లా పోర్టును నిర్మించి రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్గా రూపొందిస్తామని తెలిపారు. ఇష్టారీతగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విషయాల్లో గొడవకు దిగుతోందని చెప్పారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more