Rahul Gandhi Come back on april 19 | digvijay singh press meet

Congress vice president rahul gandhi comeback soon says digvijay singh

rahul gandhi news, rahul gandhi missing, rahul gandhi tour, rahul gandhi invisible, digvijay singh, digvijay singh updates, congress party news, congress party updates, sonia gandhi

congress vice president rahul gandhi comeback soon says digvijay singh : Congress party senior leader digvijay singh told that rahul gandhi will back on april 19. At that time congress making protest programme against bjp party.

అదిగదిగో.. యువరాజు వచ్చేస్తున్నాడోచ్!

Posted: 04/06/2015 09:05 PM IST
Congress vice president rahul gandhi comeback soon says digvijay singh

పార్లమెంటులో అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరగడానికి ముందు నుంచి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే! ఇప్పటికీ ఆయన ఎక్కడున్నారన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఆయన ఎక్కడున్నారన్న విషయమై ఇప్పటివరకు ఎవరూ పెదవి విప్పలేదు. ఇటు కాంగ్రెస్ వర్గాలు గానీ అటు గాంధీ కుటుంబం గానీ రాహుల్ ఎక్కడున్నారో ఏమిటో ఎక్కడా వెల్లడించలేదు. ఆమధ్య ట్విటర్ లో రాహుల్ కి సంబంధించి కొన్ని ఫోటోలు సంచలనం సృష్టించాయి కానీ.. అప్పటినుంచి మళ్లీ ఆయనకు సంబంధించి ఏ వివరాలు బయటకు రాలేదు.

ఇలా రాహుల్ గాంధీ ఉన్నట్టుండి మాయమవడంతో కొందరు సొంత పార్టీ నాయకులతోపాటు బీజేపీ సహా అన్ని పార్టీలు ఇన్నాళ్లుగా విమర్శనాస్త్రాలు సంధిస్తూ వస్తున్నారు. రాహుల్ పై ఎన్ని విమర్శలు వస్తున్నా.. కాంగ్రెస్ వర్గీయులు మాత్రం అతని జాడ గురించి ఏ ఒక్కరూ పెదవి విప్పలేదు. అంతెందుకు.. ఆయన ఎక్కడికెళ్లాడోనన్న విషయం తమకే తెలియదంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. అటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా కూడా రాహుల్ గురించి మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. ‘రాహుల్ తిరిగొస్తే.. ఎక్కడకెళ్లాడో అప్పుడే తెలుస్తుంది’ అంటూ మొన్న స్టేట్ మెంట్ ఇవ్వడం తప్ప.. అంతకుమించి ఏ ఒక్క మాట వెల్లడించలేదు.

దీంతో రాహుల్ అదృశ్యంపై పలురకాల ఊహాగానాలు చెలరేగాయి. పార్టీ నాయకత్వ బాధ్యతలను అప్పగించే యోచనలో సోనియా సహా పార్టీ పెద్దలు ఉన్నారన్న విషయం తెలిసే రాహుల్ ఎక్కడికో వెళ్లిపోయారని కొందరు అంటున్నారు. మరికొంతమంది.. పార్టీ ఘోరంగా అపజయం పాలవడంతోపాటు తీవ్ర విమర్శలు పార్టీమీద, తనమీద వచ్చిన నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు రాహుల్ గురికావడంతో కాస్త విశ్రాంతి తీసుకోవడం కోసం ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయి వుంటాడని అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఇక కొంతమందైతే రాహుల్ తిరిగి రాకపోతేనే చాలా బాగుంటుందని చెప్పుకుంటున్నారు. ఇంకా పలు రకాలుగా ఎవరికి వారు చెప్పుకొంటూ వస్తున్నారు.

కానీ ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం తీసుకొస్తున్న భూసేకరణ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈనెల 19న నిరసన కార్యక్రమం చేపట్టనుంది. ఆ సందర్భంలో రాహుల్ తిరిగి వస్తాడని, ఆ నిరసన కార్యక్రమంలో కూడా పాల్గొంటాడని పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. ఈసారి ఆయన రావడం మాత్రం ఖాయమేనని ఆయన అంటున్నారు. అయితే ఇది కూడా కచ్చితమైన సమాచారం కాదు. బహుశా ఆయన ఆరోజు రావచ్చని డిగ్గీరాజా అభిప్రాయం వెల్లడించారే తప్ప.. గ్యారంటీగా వస్తారని మాత్రం వస్తారని నమ్మకం లేదు. వేచి చూద్దాం...!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  digvijay singh  sonia gandhi  congress party  

Other Articles