మనిషి మనస్సును రంజింపచేయ గలిగితే.. శరీరంలోని రుగ్మతలను కూడా దూరం చేసుకోవచ్చునని డాక్టర్ గణపతి సచ్చిదానంద స్వామీజి విశ్వసించి అమలు చేస్తున్న మ్యూజీక్ ధెరపీ గెన్నీస్ రికార్డులలో స్థానం సంపాదించింది. మానవ దేహంపై అద్భుతమైన ప్రభావం చూపుతూ అనేక రకాల దీర్ఘకాలిక, తాత్కాలిక వ్యాధుల నుంచి విముకి కల్పించే స్వామీజీ మ్యూజిక్ థెరపీకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ నెల 6వ తేదీన ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒపేరా హౌస్లో నిర్వహించిన సుదీర్ఘమైన మ్యూజిక్ థెపరీ పాఠం గిన్నిస్బుక్ రికార్డుల్లోకి ఎక్కింది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన స్వామీజీ సిడ్నీలో నిర్వహించిన మ్యూజిక్ థెరపీ క్లాస్ గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించడం పట్ల ఆయన అభిమానులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. మందులు వాడుతూనే ఈ సంగీతాన్ని ఆస్వాదించడం వల్ల నాడీ వ్యవస్థ, శరీరంలోని వివిధ అవయాలు స్వాంతన పొందగలుగుతాయని, రోగవిముక్తమవుతాయని ఆయన పేర్కొన్నారు. సిడ్నీలో జరిగిన కార్యక్రమంలో వయొలిన్ కళాకారుడు డాక్టర్ ఎల్.సుబ్రహ్మణ్యం, సంగీత కళాకారులు రామదాసు, వి.సురేష్, తదితరులు పాల్గొన్నారు.
మధ్య అస్ట్రేలియాలో సిడ్నీలో జరిగిన నాద సాగర కార్యక్రమానికి ఏర్పాటు చేసిన అహుతులు, వాటెంటీర్లకు, సభ్యులకు గణపతి సచ్చితానంద స్వామీజి ధన్యవాదలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ కార్యక్రమంలో పాలో్గన్నారు. అమెరికా, దక్షిణాఫ్రికా, మలేషియా, స్విట్జర్ ల్యాండ్, డెన్ మార్క్, ల నుండి కూడా అయా దేశాల ప్రతినిధులతో అనేక మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరితో పాటు విదేశాలలో ( జర్మనీ, కెనడా, ట్రినిడాడ్, సింగపూర్; న్యూజీలాండ్, జపాన్, ఇండోనేషియా సహా అనే దేశాల నుంచి) భారతీయులు కూడా కార్యక్రమంలో భాగం పంచుకున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more