ఆంధ్రప్రదేశ్ వాహనాదారులకు హైకోర్టులో చుక్కెదురైంది. ఇరు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్న వాహనాలు ఎంట్రీ టాక్స్ ను ఖచ్చితంగా కట్టితీరాల్సిందేనంటూ రాష్ట్రోన్నత కోర్టు తీర్పును వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వాహనాలు తెలంగాణలోకి ప్రవేశించడం పట్ల వసూలు చేస్తున్న పన్ను (ఎంట్రీ టాక్స్) విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రోన్నత కోర్టును ఆశ్రయించిన వాహనదారులకు ఎదురు దెబ్బ తగిలింది. ఎంట్రీ టాక్స్ ను విధించాల్సిందేనని రష్ట్రోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది.అంతర్ రాష్ట్ర పన్ను విధానంపై దాఖలైన పిటీషన్ ను విచారించిన హైకోర్టు.. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఈ విధంగా వసూలయ్యే మొత్తం పన్ను డబ్బును బ్యాంకుల్లో జమచేయాల్సిందిగా సూచించింది. ఈ డబ్బును ఎలాంటి అవసరాలకు వినియోగించకూడదని స్పష్టం చేసింది.
బ్యాంకుల్లో హామీ పత్రలాలకు బదులుగా వసూలైయ్యే నగదునే జమచేయాలని ఆదేశించింది. రవాణా కమిషనర్ పేరుతో బ్యాంకు ఖాతా తెరిచి ఆ ట్యాక్స్‌ను వాహన యజమానులు బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలని సూచించింది వాహన యాజమానులు కూడా బ్యాంకుల్లో డబ్బును జమచేస్తే చాలునని చెప్పింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాఖు వచ్చే వాహనాలకు ఎంట్రీ ట్యాక్స్‌ను వసూలు చేయటంపై 280మంది వాహనదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, వారికి మాత్రమే ఈ తీర్పు వర్తిస్తందని కోర్టు స్పష్టం చేసింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more