Ramesh Aravind Clarification on Uttama Villain Movie | VHP Ban

Ramesh aravind clarification uttama villain vhp ban kamal hassan

uttama villain movie, uttama villain controversy, uttama villain updates, uttama villain ban news, uttama villain vhp ban news, kamal hassan controversy, kamal hassan news, vhp uttama villain ban, ramesh aravind news, ramesh aravind controversy

Ramesh Aravind Clarification Uttama Villain VHP Ban Kamal Hassan : Finally the director and actor ramesh aravind has given clarification that there are nothing in their uttama villain movie which will hurt anybody sentiment.

‘అయ్యా.. ‘ఉత్తమ’మే తప్ప ఎవరినీ కించపరచలేదు’

Posted: 04/10/2015 09:08 PM IST
Ramesh aravind clarification uttama villain vhp ban kamal hassan

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన ‘ఉత్తమ విలన్’ చిత్రంలో హిందువులను కించపరిచే సన్నివేశాలున్నాయని, ఆ చిత్రం విడుదలకు బ్యాన్ చేయాలంటూ ఇటీవలే విశ్వహిందూ పరిషత్ (వీ.హెచ్.పీ) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే! ముఖ్యంగా.. విష్ణుమూర్తి భక్తుడు ప్రహ్లాదకు, హిరణ్యకశపుడు అనే రాక్షసుడికి మధ్య జరిగే సంభాషణ ఆధారంగా ఈ మూవీలో తెరకెక్కిన ఒక పాట విష్ణుమూర్తి భక్తులను నిరాశకు గురి చేస్తుందని వీ.హెచ్.పీ వివరించింది. ఈ క్రమంలోనే ఈ మూవీ విడుదలను ఆపేయాలంటూ పోలీస్ కమిషనర్ కు ఓ నివేదికను కూడా సమర్పించింది.

అయితే.. ఈ ‘ఉత్తమ’మైన తమ సినిమాలో ఏ మతాన్ని కించపరిచే సన్నివేశాలు లేవని దర్శకుడు రమేశ్ అరవింద్ స్పష్టం చేశారు. ఈ సినిమాపై నిషేధం విధించాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన తాజాగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే రమేశ్ మాట్లాడుతూ.. ‘దర్శకుడిగా చెబుతున్నా. ‘ఉత్తమ విలన్’ సినిమాలో ఎవరి మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలుగానీ, మాటలుగానీ లేవు. ఇది ఒక సూపర్ స్టార్ భావాలకు సంబంధించిన సినిమా! ఇందులో ఆయన ప్రయాణం, భావోద్వేగాల గురించి మాత్రమే చూపించాం. పాటల్లోనూ ఏ మతానికి వ్యతిరేకంగా చూపించలేదు’ అని ఆయన వివరణ ఇచ్చారు.

అలాగే.. తమకు వ్యతిరేకంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. సెన్సార్ బోర్డు తమకు క్లీన్ చీట్ ఇచ్చిందని, సినిమా విడుదలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాబోవని అన్నారు. మే 1న విడుదలకానున్న ఉత్తమ విలన్ సినిమాకు సెన్సార్ బోర్డు 'యూ' సర్టిఫికెట్ ఇచ్చింది. నిజానికి ఈ చిత్రం ఏప్రిల్ 10వ తేదీన విడుదల కావల్సి వుండేది కానీ అప్పుడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. ఇప్పుడు బోర్డు 'యూ' సర్టిఫికెట్ ఇచ్చేసింది కాబట్టి.. ఈసారి మే 1 ఈ మూవీ విడుదల ఖాయమని దర్శకుడు పేర్కొన్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uttama villain ban  kamal hassan  ramesh aravind  vishwahindu parishad  

Other Articles