New York woman marries 10 men in a decade

Ny woman accused of marrying 10 men without a divorce

Manhattan woman faces felony charges, New York woman marries 10 men in a decade, New York Woman Accused of Marrying 10 Men Without a Divorce, criminal complaint, 10 husbands, new york woman, manhattan women, cheating, divorce, Fraud Case, Woman, 10 marriages, Kristina Barrientos

A Manhattan woman faces felony charges in the Bronx after marrying 10 different men across an 11-year span — without getting a single divorce from any of her “husbands,” according to a criminal complaint.

పది మంది భర్తలున్నారు..కానీ పెళ్లే కాలేదు..!

Posted: 04/10/2015 09:14 PM IST
Ny woman accused of marrying 10 men without a divorce

ఈ శీర్షక చూడగానే వింతగా అనిపిస్తుంది కదూ..! అవునండీ వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ యువకుల్ని బురీడీ కొట్టించి.. తన పబ్బం గడుపుకుంటూ, సరదాలు తీర్చుకోవడమే ఆ మహిళకు హాబీ. పది మంది భర్తలున్నప్పటికీ.. అమె తనకింకా పెళ్లే కాలేదంట యువకులను బురడీ కోట్టిస్తుంది. వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తితే.. వారితో విడాకులు తీసుకుని మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమయ్యందనుకుంటున్నారా.. అయితే పోరబాటే.. ఎందుకంటే ఈమెకు అసలు వైవాహిక సమస్యలే లేవు. యువకులను మోసం  చేస్తూ జల్సాలకు అలవాటు మరిగిన ఓ అమెరికన్ మహిళ వైనం ఇది.

అమెరికాకు చెందిన లైనా క్రిస్టినా బారైన్ టోస్(39) కు పెళ్లిళ్లు చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఈ పరంపరను 1999 ను కొనసాగిస్తూ వస్తోంది. అప్పట్నుంచి ఇప్పటి వరకూ 10 పెళ్లిళ్లు చేసుకున్నఅమె తన భర్తలందరినీ మోసం చేస్తూనే వుంది. విషయం బయటకు తెలియడంతో ఆమెపై మోసం తదితర నేరాల కింద కేసులు నమోదయ్యాయి. 2002 లో  ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భర్తలతో క్రిస్టినా ఆ సంవత్సరం అంతా బిజీ బిజీగా గడిపింది.
 
ఆ సంవత్సరం వాలెంటైన్స్ డే రోజున మోసపు పెళ్లికి తెరలేపిన లైనా క్రిస్టినా.. 15 రోజుల తరువాత రాక్ లాండ్ దేశంలో  మరో పెళ్లి చేసుకుంది. మరో నెల రోజుల తరువాత మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నా ఎవరి వద్ద నుంచి విడాకులు మాత్రం పొందకపోవడం గమనార్హం. ఇప్పటివరకూ తన మ్యారేజ్ లైసెన్స్ పై పెళ్లి కానట్టే ధృవీకరించి మోసపు చర్యలకు పాల్పడింది. దీనిపై శుక్రవారం మోసపు కేసు నమోదు చేసిన అధికారులు  దర్యాప్తు చేపట్టారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fraud Case  Woman  10 marriages  Kristina Barrientos  

Other Articles