SIMI had designed to kill Narendra Modi in Ambikapur, admits SIMI operative

Simi had planned to kill narendra modi in ambikapur

narendra modi, SIMI, Ambikapur, Prime Minister, Uttar Pradesh, Umer Siddiqui, Nepal, lok sabha elections, Raipur, Chhattisgarh, SIMI, Gurfan, Prime Minister, terrorism,

In one of the most shocking confessions, Gurfan, a SIMI operative has admitted that his organization had plans to kill Narendra Modi in Ambikapur before he was chosen as the Prime Minister of India, sources inform.

ప్రధాని నరేంద్రమోడీ హత్యకు సిమి కుట్ర.. అంగీకరించిన ముష్కరుడు

Posted: 04/11/2015 08:04 PM IST
Simi had planned to kill narendra modi in ambikapur

యావత్ భారతం విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాని మన్మోహన్ సింగ్ సమావేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం వెనుక దాగివున్న కుట్రను ఎట్టకేలకు చత్తీస్ఘడ్ పోలీసుల రాబట్టారు. పోలీసుల అదుపులో వున్న సెమి ఉగ్రవాది వెల్లడించిన మేరకు వారు ప్రధాని నరేంద్ర మోదీ హత్యా యత్నానికి కుట్రపన్నినట్లు సమాచారం. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సిమీ) ఉగ్రవాది గుర్ఫాన్ వెల్లడిస్తున్న విషయాలు  పోలీస్ వర్గాల్లో కలకలం   రేపుతున్నాయి.   ప్రధానమంత్రి నరేంద్రమోదీని హత్య చేసేందుకు సిమి ప్లాన్ చేసి విఫలమైనట్లు సమాచారం. అంబికాపూర్ లోక్సభ ఎన్నికల  ప్రచార ర్యాలీలో మోదీని హత్యచేసేందుకు సిమీ కుట్ర పన్నినట్లు ఉగ్రవాది అంగీకరించాడు. అయితే  కొన్ని అనివార్య కారణాల వల్ల తన పథకాలను అమలు చేయలేకపోయినట్టుగా గుర్ఫాన్  పోలీస్ విచారణలో అంగీకరించాడు.

రాష్ట్ర ఐజీ జేపీసింగ్ సమాచారం ప్రకారం  ..జార్ఖండ్ పేలుళ్ళ సంఘటన తరువాత రాయ్పూర్ నుంచి పరారైన గుర్ఫాన్ అరేబియన్ సముద్రానికి సమీపంలో తలదాచుకున్నాడు.  అక్కడ కొన్నాళ్లు కేర్ టేకర్గా పనిచేశాడు.  అతను దుబాయ్లో ఉన్నపుడు అంతర్జాతీయ ఉగ్రవాది అబూ సలేంతో సమావేశమయ్యాడు. ఈ సందర్భంగా మరి కొంతమంది సభ్యులను కలిసినట్టుగా అంగీకరించాడు. అంతేకాదు గుర్ఫాన్ సిమీ నేతల ఆధ్వర్యంలో నేపాల్లో జరిగిన న్యూ ఇయర్  గ్రాండ్ పార్టీకి కూడా హాజరైనట్టుగా పోలీసులు చెబుతున్నారు.  

తన సహచరులు ఇజాయిద్దీన్, అస్లాం ను ఇండోర్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన తరువాత స్వయంగా గుర్ఫాన్  రాయ్పూర్ కోర్టులో లొంగిపోయాడు. అయితే గుర్ఫాన్ పోలీసుల విచారణకు సహకరిస్తున్నప్పటికీ, కీలక సమాచారాన్ని మాత్రం అందించడంలేదని ఐజీ వెల్లడించారు.  జార్ఖండ్ పేలుళ్ల సూత్రధారులను  తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నేరగాళ్లందరూ నేపాల్ లో అబు సలేం ఇచ్చిన పార్టీకి హాజరైయ్యారన్న సమాచారంతో వారిలో భారత్ కు చెందిన వారెవరెరు వున్నారన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raipur  Chhattisgarh  SIMI  Gurfan  Prime Minister  terrorism  

Other Articles