శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై హైకోర్టులో ఈ రోజు వాదనలు జరిగాయి. అయితే ఎన్ కౌంటర్ విషయాలు మీడియాలో రావడంపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ మీడియాకు విషయాలు వెల్లడించారు అంటే అది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని కూడా కోర్టు వెల్లడించింది. విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. తన భర్తను బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపారని ఆరోపిస్తూ చెన్నైకు చెందిన మణియమ్మన్ స్పీడ్ పోస్ట్ ద్వారా చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఏపీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆమెను ప్రతివాదిగా చేర్చాలంటూ ఆదేశించింది. దర్యాపు వివరాలను గోప్యంగా ఉంచాలని కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు ఎక్కడా ఎవరూ ప్రస్తావించకూడదని తెలిపింది. కేసు విచారణలో ఉండగా వివరాలు ఎలా వెల్లడిస్తారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ఆమెకు న్యాయ సహాయాన్ని అందించాల్సిందిగా లీగల్ సర్వీస్ అథారిటీని హైకోర్టు ఆదేశించింది.
మరో పక్క జాతీయ మానవ హక్కుల సంఘం ముందు కొందరు తమిళ కూలీలు పోలీసులకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారు. తమ ముందే తమ వారిని అరెస్టు చేసి తీసుకెళ్లారని, తర్వాత వారిని కాల్చి వేసి ఎన్ కౌంటర్ అని చెబుతున్నారని కూడా వారు కమీషన్ ముందు వెల్లడించారు. మొత్తానికి తమిళనాడుకు చెందిన కూలీలను కావాలనే పోలీసులు ఎన్ కౌంటర్ లో చంపేశారని వస్తున్నయ ఆరోపణలకు మరింత బలం చేకూరేలా జాతీయ మానవ హక్కు సంఘం ముందు వాగ్మూలాలు నమోదయ్యాయి. మరి ఈ ఎన్ కౌంటర్ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more