physical relationship breaksdown social media sites | facebook | twitter

Physical relationship breaksdown with social media networks facebook twitter

physical relationship, facebook users, twitter users, social media networks, social media sites, facebook controversy, twitter controversy, facebook divorce, twitter divorce, physical values

physical relationship breaksdown with social media networks facebook twitter : According to the latest technology survey.. physical relationship breaksdown with social media networks like facebook, twitter.

సోషల్ మీడియాలో ‘బుక్’ అవుతున్న వ్యక్తిగత సంబంధాలు..

Posted: 04/13/2015 01:15 PM IST
Physical relationship breaksdown with social media networks facebook twitter

ప్రస్తుత జనరేషన్ లో యువతీయువకులు సోషల్ మీడియాకు బాగా అడిక్ట్ అయిన విషయం తెలిసిందే! ముఖ్యంగా ఫేస్ బుక్, ట్విటర్ వంటి సోషల్ మాధ్యమాల వాడకం అయితే మరీ దారుణంగా పెరిగిపోయింది. ఒకప్పుడు చేతులతో ‘హాయ్’ అంటూ పలకరించుకునే స్నేహితులు.. ఇప్పుడు అదే చేతుల్లో స్మార్ట్ ఫోన్లు పట్టుకుని వ్యక్తిగత భావాలను దూరం చేసుకుంటున్నారు. రెండు మనసుల కలయికతో ఏర్పడే బంధాన్ని సోషల్ మీడియాను వారధిలా ఉపయోగిస్తూ దూరంగా జరుగుతున్నారు.

అందుకు ఉదాహరణగా కొన్ని సంఘటనలను తీసుకోవచ్చు. రమేష్, సురేష్ కొత్త స్నేహితులు.. వీరిద్దరిని కలిపింది ఫేస్‌బుక్కే. ఒకనాడు రమేష్ తన ఫొటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా.. దాన్ని సురేష్ లైక్ చేయలేదు. అంతే! ఇద్దరి మధ్యా విభేదాలు పెరిగాయి. సురేష్‌ను క లవమని చెప్పిన రమేష్.. ‘లైక్ ఎందుకు కొట్టలేదురా..!’ అంటూ అతడ్ని చితకబాదేశాడు.  ఈ సంఘటన ఇటీవల మన సైబరాబాద్ పరిధిలో జరిగింది. ఇక వాట్సప్ గ్రూప్‌లో తను కోరిన అమ్మాయి ఫొటో అప్‌లోడ్ చేయనందుకు మరో యువకుడు ఆ గ్రూప్ అడ్మిన్‌పైనే దాడి చేశాడు. అలాగే.. ఫేస్ బుక్, వాట్సాప్ లో తన భార్య మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదని ఏకంగా విడాకులే ఇచ్చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో బంధాలు సోషల్ మీడియా ద్వారా పటాపంచలైపోయాయి. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు కాలక్రమంలో పెరుగుతూ బంధాలు బెడిసికొడుతున్నాయని ఓ టెక్నాలజీ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.

ఆ సర్వే వివరాల ప్రకారం..  ఫేస్‌బుక్ వాడుతున్న వారిలో తాము పోస్ట్ చేసిన వాటికి వచ్చిన లైకులను లెక్కకట్టి మరీ గొప్పలుగా చెప్పుకునే వారు 72 శాతం మంది ఉన్నారని తెలిసింది. ఇక 75 శాతం మంది తమ పోస్ట్‌లకు అత్యధికంగా లైక్‌లు రావాలని కోరుకుంటున్నారట. 73 శాతం మంది తప్పుడు సమాచారంతోనైనా.. తమ గొప్పతనం చాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారట. ఇక ఆశించిన మేర లైకులు, షేర్లు రాకపోతే.. 58 శాతం మంది ఏదో కోల్పోయామన్న ఫీలింగ్‌తో ఒత్తిడికి గురవుతున్నారట! 64 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లల చర్యలను ఓ కంట కనిపెడుతుంటే.. తల్లిదండ్రులకు తెలియకుండా ఆన్‌లైన్‌లో విహరించే యువత సంఖ్య 68 శాతంగా వున్నారని లెక్క తేలింది. 57 శాతం మంది ఆన్‌లైన్‌లో అజ్ఞాత వ్యక్తులతో లింకవుతున్నారు. అంతేకాదు.. అకౌంట్ హ్యాకింగ్, సైబర్ వేధింపులు ఎదురైతే ఎలా స్పందించాలో తెలియని వారి లెక్క 70 శాతంగా తేలింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : physical relationship  facebook  twitter  social media sites  

Other Articles