chris gayle create history in ipl by hitting 200 sixes

Chris gayle create history in ipl by hitting 200 sixes

chris gayle news, chris gayle updates, chris gayle records, chris gayle ipl news, ipl 8 news, chris gayle photos, chris gayle records, chris gayle score

chris gayle create history in ipl by hitting 200 sixes : The West Indies batsman chris gayle creates new Record in Ipl History by hitting 200 sixes.

‘ఐపీఎల్’ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన గేల్

Posted: 04/13/2015 08:31 PM IST
Chris gayle create history in ipl by hitting 200 sixes

క్రికెట్ ఫార్మాట్ ఏదైనా సరే.. తనదైన శైలితో పరుగుల విధ్వంసం సృష్టించడంలో ఎప్పటికీ ముందుంటాడు కరేబియన్ ఆటగాడు క్రిస్ గేల్! ఇతను క్రీజులో వుంటే చాలు.. ఇతను ధాటికి స్టేడియం మొత్తం పరుగుల వర్షంతో నిండిపోతుంది. బ్యాట్ ఎత్తితే చాలు.. బాల్ బౌండరీ వైపే! ఇతను ఆట వీక్షించే మైదానంలో వున్న ప్రేక్షకులతోపాటు టీవీ వీక్షకులకు కూడా కన్నుల పండుగే! ఇతని క్రికెట్ కెరీర్ లో ఇప్పటికే ఎన్నో రికార్డులు కైవసం చేసుకున్న ఈ క్రికెటర్.. తాజాగా ఐపీఎల్ లో అరుదైన ఘనత నమోదు చేసుకుని సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు.

ఇటీవల ముగిసిన మెగాటోర్నీలో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా నిలిచిన క్రిల్ గేల్.. ఇప్పుడు ఐపీఎల్ లో 200 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ఐపీఎల్ - 8 సీజన్ లో భాగంగా బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బెంగుళూరు రాయల్ ఛాలంజర్స్, సన్ రైటర్స్ హైదరాబాద్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ కు సంబంధించి టాస్ గెలిచిన సన్ రైజర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని, బెంగుళూరుకు బ్యాటింగ్ కు ఆహ్వానించింది. కొద్దిసేపటి క్రీతమే ప్రారంభమైన ఈ మ్యాచులో గేల్ తన పరుగుల విధ్వంసాన్ని అప్పుడే మొదలుపెట్టేశాడు. తొలి ఓవర్ మూడో బంతినే సిక్స్ గా మలిచిన గేల్.. ఆ సిక్సుతో ఐపీఎల్ లో 200 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డ్ సాధించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chris gayle  bangalore royal challengers  sun risers hyderabad  

Other Articles