తెలంగాణలో అతి ప్రమాదకర బర్డ్ ఫ్లూ తన ప్రతాపాన్ని చూపుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా బర్డ్ ఫ్లూను అధికారులు కోళ్లకు సోకిందని నిర్దారించారు. దాంతో కోళ్ల ఫాం యాజమాన్యంలో భయం మొదలైంది. తెలంగాణ రాజధాని శివార్లలోని హయత్‌నగర్ మండలం తొర్రూరు గ్రామంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. గ్రామానికి చెందిన వంగిటి శ్రీనివాసరెడ్డి, వంగిటి బాలకృష్ణారెడ్డికి చెందిన కోళ్ల ఫారాల్లో.. వారం రోజులుగా కోళ్లు చనిపోతుండటంతో వెటర్నరీ డాక్టర్లను సంప్రదించారు. చనిపోయిన కోళ్ల నమూనాలను వైద్యులు పరీక్షల నిమిత్తం భోపాల్‌కు పంపించారు. ఈ కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు నిపుణులు నిర్ధారించారు. దీంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన రావు.. రెవెన్యూ, పశు సంవర్థక శాఖ, వైద్యాధికారులతో రాత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ రాజధాని శివార్లలోని హయత్‌నగర్ మండలం తొర్రూరు గ్రామానికి పది కిలోమీటర్ల పరిధిలో కోళ్లు, గుడ్ల ఉత్పత్తి ఆపేయాలన్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎవరూ చికెన్, గుడ్లు తినవద్దని హెచ్చరికలు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ సోకినట్లు గుర్తించిన ఫారానికి కిలోమీటర్ దూరంలోని అన్ని కోళ్ల ఫారాల్లో దాదాపు 2 లక్షల కోళ్లను చంపేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు ఇతర ప్రాంతాలకు ఫ్లూ సోకిందా లేదా అనే విషయంపై కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. కోళ్ల ఫారాల యజమానులతో మాట్లాడుతున్నారు. మరోవైపు హయత్‌నగర్‌తోపాటు కందుకూరు, యాచారం, ఇబ్రహీంపట్నం, సరూర్‌నగర్ మండలాల నుంచే హైదరాబాద్‌కు ఎక్కువగా కోళ్లు, గుడ్లు సరఫరా అవుతాయి. దీంతో ఆ ప్రాంతాల్లో పరిస్థితి ఏంటనే విషయంపైనా అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. శాంపుల్స్ తీసుకుని భోపాల్‌కు పరీక్ష కోసం పంపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు బయటపడటం ఇదే మొదటిసారి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more