Chittur | Tamilnadu | Encounter | Kidnap

Chittur encounter getting new angels in the case at high court of ap

Chittur, Encounter, ap, tamilnadu, police, high court, murder, maniyamman,

Chittur encounter getting new angels in the case at high court of ap. The court order to file a murder case andalso kidnap case on police who participated in chittur encounte

మలుపులు తిరుగుతున్న ఎన్ కౌంటర్ కేసు.. నేడు విచారణ

Posted: 04/16/2015 09:17 AM IST
Chittur encounter getting new angels in the case at high court of ap

చిత్తూరు జిల్లా శేషాచలం ఎన్‌కౌంటర్‌పై విచారణను హైకోర్టు విచారణ నేడు కొనసాగనుంది. ఎన్ కౌంటర్‌కు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను, చనిపోయిన వ్యక్తుల శవపరీక్ష నివేదికలను సమర్పించాలని ఆంధ్ర ప్రదేశ్‌ సర్కార్‌ను ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌పై విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేశామంటూ ఏపీ ప్రభుత్వం తెలియజేయడంతో సిట్‌ దర్యాప్తును తామే మాని టరింగ్‌ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. తన భర్త మృతదేహానికి మరోసారి పోస్టు మార్టం నిర్వహించాలని మణియమ్మన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమెను ప్రతివాదిగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ సందర్భంగా బుధవారం హైకోర్టులో వాద ప్రతివాదనలు జరిగాయి. తన భర్తను బూటకపు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారని ఆరోపిస్తూ చెన్నైకు చెందిన మణియమ్మన్‌ స్పీడ్‌పోస్ట్‌ ద్వారా చంద్రగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో దీనిపై సీరియస్‌గా స్పందించిన హైకోర్టు కేసు విచారణను చేపట్టిన విషయం తెలిసిందే.

శేషాచలం ఎన్‌కౌంటర్‌పై ఎట్టకేలకు కేసు నమోదైంది. బాధితుల ఆందోళన, హక్కుల సంఘాల నిరసనల మధ్య ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 24 మంది పోలీసులపై కిడ్నాప్, హత్య సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాల్పుల్లో మృతి చెందిన శశికుమార్ భార్య మునియమ్మాళ్ ఫిర్యాదు మేరకు చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.ఘటనలో పాల్గొన్న వారిపై హ త్య, కిడ్నాప్ కింద కేసులు నమోదు చేశామంటూ పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించడం, తమ ప్రతివాదిగా బాధితుల్లో ఒకరైన మునియమ్మాళ్ పేరును చేర్చడంతో ఈ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. దీనికి తోడు బాధితురాలు మునియమ్మాళ్ సైతం రీ పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఇకపై జరిగే పరిణామాల ఆధారంగా  కేసు నుంచి బయటపడాలని పోలీసు శాఖ భావిస్తోంది. ఇప్పటిదాకా తీసుకున్న చర్యలతో తాత్కాలికంగా ఆందోళనలు అదుపు చేయవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఇదే అవకాశంగా తీసుకుని బాధితులను మభ్యపెట్టి తమవైపు తిప్పుకునేలా వ్యూహం రూపొందించడానికి పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chittur  Encounter  ap  tamilnadu  police  high court  murder  maniyamman  

Other Articles