మా ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ గెలిపొందారు. ఎట్టకేలకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఫిలింఛాంబర్ లో ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం 702 ఓట్లు వుండగా అందులో కేవలం 394 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. మా అధ్యక్షుడిగా జయసుధపై రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో గెలిచిన నటులు రాజేంద్ర ప్రసాద్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి నటి జయసుధ వర్గం వారు చెప్పినట్లుగా ఎలాంటి మంచి పనులు చేయనున్నారో త్వరలోనే తెలియనుంది. మార్చి 29న ‘మా’ అధ్యక్ష ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ‘మా’ అధ్యక్ష పదవికోసం నటులు రాజేంద్రప్రసాద్, జయసుధలు పోటీ పడ్డారు. అయితే ఆ తర్వాత రెండు రోజులకే విడుదల కావాలసిన ఫలితాలు ఒ.కళ్యాణ్ కోర్టులో వేసిన పిటీషన్ వలన ఇన్ని రోజులు ఫలితాల విడుదల వాయిదాలు పడుతూ వచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలకు రిటర్నింగ్ అధికారిగా కృష్ణమోహన్ వ్యవహరించారు. ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభం అయిన క్షణం నుంచి సినీ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాలపై మొత్తం ఏడు రౌండ్లకు గాను అన్ని రౌండ్లలోనూ రాజేంద్ర ప్రసాద్ లీడ్ లో సాగారు.
*రాజేంద్ర ప్రసాద్ గెలుపు
* ముందు నుండి లీడ్ లో సాగిన రాజేంద్ర ప్రసాద్
*మరి కొద్ది సేపట్లో అధికారికంగా వెల్లడించే అవకాశం
*మా లో ముగిసిన ఆధిపత్యం
* మా ఫలితాల వెల్లడికి ఏడు రౌండ్లలో కౌంటింగ్.
*అన్ని రౌండ్లలో ఆధిక్యం లో రాజేంద్ర ప్రసాద్ ముందుకు దూసుకెళ్ళారు
* మొత్తం 702 ఓట్లకు గాను 394 ఓట్లు పోలయ్యాయి.
*87 ఓట్లతో గెలుపును సొంతంచేసుకున్న రాజేంద్రప్రసాద్
* ఫిలిం ఛాంబర్ లో రాజేంద్ర ప్రసాద్ వర్గం వారు సంబరాలు చేసుకుంటున్నారు.
* జయసుధ వర్గం వారు కొంత నిరాశతో ఉన్నారు.
*ఈ ఓటమికి మురళీ మోహన్ దే బాధ్యత- బాలచందర్
*రాజేంద్ర ప్రసాద్ ను బలపరిచిన నాగేంద్ర బాబు
* మా లో అవినీతిని ముందు నుండి వ్యతిరేకించిన రాజేంద్ర ప్రసాద్ ప్యానల్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more