వెయ్యి మంది సభ్యులు కూడా లేని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. సాధారణ రాజకీయాల్లోలానే మా రాజకీయాలు కూడా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎవరి కోసం ఈ గొడవలు.? ఎందుకు ఇంత హడావిడి? ఇదే ప్రస్తుతం అందిరిలో వస్తున్న ప్రశ్నలు. మురళీమోహన్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోగానే సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. రాజేంద్రప్రసాద్ సినీ రంగంలో అందరికీ కావాల్సిన వ్యక్తి. ఆయన మీద గౌరవంతో ఇంకెవరూ పోటీలో నిలవరు అని అనుకున్నా.. మురళీమోహనే స్వయంగా జయసుధను తెరపైకి తీసుకొచ్చారు. సినిమా పబ్లిసిటీ కోసం నానా తంటాలూ పడ్తుంటారు దర్శకులు, నిర్మాతలు, నటులు.. అచ్చం అలానే తయారైంది ‘మా’ ఎన్నికల వ్యవహారం కూడా. పబ్లిసిటీ స్టంట్‌ని తలపించేలా వుంది ఈ మొత్తం ప్రక్రియ. ఎవరో తెరవెనుక వుండి నడిపిస్తున్నారని కొందరు, అంతా కుట్రపూరితం.. అని ఇంకొందరు.. దుమ్మెత్తిపోసుకుంటోంటే, సగటు సినీ అభిమాని ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. ఒకాయన ఓ అడుగు ముందుకేసి కోర్టును ఆశ్రయించాడు. దాంతో ఎన్నికలు జరుపుకోండి, ఫలితం మాత్రం చెప్పొద్దు.. అని న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ఇంత సినిమా అవసరమా.? ఇంత పబ్లిసిటీ దేని కోసం.? ఈ హంగామా వెనుక అసలు ఉద్దేశ్యమేంటి.? అందరూ కలిసి గూడు పుఠానీ చేస్తున్నారా.? ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకోవడం నిజమేనా.? ఇలా ఎన్నెన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మురళీ మోహన్ పై కొంతో గొప్పో గౌరవం ఉన్న వారికి కూడా మా ఎన్నికలు దాన్ని కూడా పోగొట్టాయి.
మా ఎన్నికల్లో జరిగిన ఘటనలు..
* మా ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదని మురళీ మోహన్ ప్రకటన
* రాజేంద్ర ప్రసాద్ ను మా అధ్యక్ష ఎన్నికల్లో నిలబెట్టేందుకు నాగబాబు ప్రయత్నం
* రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల్లో పోటీకి అంతా సిద్దం
* జయసుధ ను పోటీలోకి దించనున్నట్లు ప్రకటించిన మురళీ మోహన్
* మురళీ మోహన్ వైఖరిపై మండిపడ్డ నాగబాబు
* వెనక్కి తగ్గని మురళీ మోహన్, నాగబాబు
* దాంతో జయసుధ, రాజేంద్రప్రసాద్ ల మధ్య పోటీ అనివార్యమైంది.
దాంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాజకీయ నాయకులకు ఏ మాత్రం తీసిపోకుండా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న రాజేంద్రప్రసాద్ ప్యానెల్‌పై జయసుధ ప్యానెల్ ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ అయింది.
ఎన్నికలకు జయసుధ, రాజేంద్ర ప్రసాద్ లు నిలబడిన తర్వాత జరిగిన పరిణామాలు..
* తమను బెదిరిస్తున్నారంటూ జయసుధ ఆరోపణలు
* ఒక్కరుచాలు..కుప్పలెందుకు? జయసుధ ప్యానెల్‌పై నాగబాబు ఫైర్
* తొలుత కొందరు పెద్దలు కూడా మద్దుతు ఇచ్చి ఏకగ్రీవం చేస్తానని చెబితేనే రాజేంద్రప్రసాద్ బరిలోకి దిగారు
* రాజేంద్రప్రసాద్‌కు స్టేచర్ లేదన్న మురళీ మోహన్
* మాపై సిల్లీ ఆరోపణలు చేయడమే బాధగా ఉంది. మేము ఏదో రాజకీయాలు చేస్తున్నామని అంటున్నారు. బెదిరిస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారు- నాగబాబు
* అసోసియేషన్లో రూ. 3 కోట్ల ఫండ్ ఉందంటున్నారు. కానీ పేద కళాకారులకు ఎలాంటి సహాయం చేయడం లేదు- నాగబాబు
* కళాకారులకు మెడిక్లైమ్ లేదు- నాగబాబు
* మురళీ మోహన్ అసోసియేషన్ మెంబర్ షిప్ రూ. 1 లక్ష చేసారు- నాగబాబు
* పేద కళాకారులు అసోసియేషన్లోకి రాకుండా గేట్లే వేసారు' అంటూ నాగ బాబు వ్యాఖ్యనించారు. ‘
* కళాకారులంతా ఒక్కసారి ఆలోచించుకోండి. సేవ చేసే వారిని గెలిపించండి. మార్పు కావాలంటే ఒక్కరు చాలు- నాగబాబు
మా ఎన్నికల్లోకి దేవుడు, మృత్యుంజయ హోమం..
గత రెండు సంవత్సరాలుగా టాలీవుడ్ ను వేదిస్తున్న అకాల మరణాల నుండి టాలీవుడ్ పరిశ్రమను రక్షించమని కోరుతూ ఫిలింనగర్ దైవ సన్నిదానంలో ప్రారంభమైన ‘అమృత పాసుపత మృత్యుంజయ’ హోమంలో ‘మా’ ఎన్నికల రాజకీయ వేడి హంగామా అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఎప్పుడూ లేని విధంగా ‘మా’ ఎన్నికలు రెండు సామజిక వర్గాల హోరుగా మారి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మృత్యుంజయ హోమంలో కూడా భక్తి కంటే ఈ రాజకీయాల గోల హాట్ టాపిక్ గా మారి అందర్నీ ఆశ్చర్య పరిచారు.
సందట్లో సడేమియాలాగా మా ఎన్నికల్లో హేమ వివాదం..
నటి హేమ తనపై చేసిన వ్యాఖ్యలు తన విజ్ఞతకే వదిలేస్తున్నానని నటుడు శివాజీ రాజా అన్నారు. ఆమె కంట్రోల్లో ఉంటే బావుంటుందని చెప్పారు. మా ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ తరుపున పోటి చేస్తున్న ఆయన ఎన్నికల సందర్భంగా మాట్లాడుతూ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లి మాట్లాడాల్సిన అవసరం హేమకు ఏముందని ప్రశ్నించారు. వీలుంటే మంచి చేయాలని హితవు పలికారు. వారు ఓడిపోతారనే భయంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హేమ మీపై ఎన్నికల అనంతరం చర్యలు తీసుకుంటారని అంటున్నారుగా అని ప్రశ్నించగా వారు ఏ చర్యలైనా తీసుకోవచ్చని, తాను తాటాకు చప్పుళ్లకు భయపడనని అన్నారు. తాను గొప్ప పోరాటయోధుడినని తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ను ఒంటరి చేయడం ఇష్టం లేకే ఓడిపోయినా సరే ఎన్నికలకు వచ్చానని అన్నారు. అనవసరమైన ఆరోపణలు చేయొద్దని.. ఏదైనా ఉంటే కెమెరా ముందు నటించాలేగానీ, కెమెరా వెనుక వద్దని చెప్పారు. ఎన్నికల ప్రభావం సినిమాలో నటించడంపై పడబోదని స్పష్టం చేశారు.
మా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు..
* ఆర్ధిక స్థోమత లేని కళాకారులు పాతిక మందికి నెలనెలా పింఛను ఇచ్చేవారని, అది ఒక్కటికి వచ్చేసిందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
* తాను అధ్యక్షుడిని అయితే యాభై మందికి పింఛను ఇస్తానని రాజేంద్రప్రసాద్ ప్రకటించారు.
* సినీ కార్మికుల సంక్షేమం కోసం మా తరఫున అనేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మురళీమోహన్ తెలిపారు.
* సినీ కార్మికులకు మెడికల్ టెస్టులు చేయిస్తున్నామని, పేదకార్మికులకు మందుల ఖర్చులు అందిస్తున్నామన్న మురళీమోహన్
* గతేడాది 250 మందికి వైద్యచికిత్సలు చేయించామన్నారు. కార్మికులందరికీ ఆరోగ్య కార్డులు ఇచ్చామన్న మురళీ మోహన్
మార్చి 29న మా ఎన్నికలు ఎంతో రసవత్తరంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ గెలిపొందారు. ఎమొత్తం 702 ఓట్లు వుండగా అందులో కేవలం 394 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. మా అధ్యక్షుడిగా జయసుధపై 87 ఓట్ల తేడాతో రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో గెలిచిన మా ఎన్నికల ఫలితాలకు రిటర్నింగ్ అధికారిగా కృష్ణమోహన్ వ్యవహరించారు. ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభం అయిన క్షణం నుంచి సినీ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాలపై మొత్తం ఏడు రౌండ్లకు గాను అన్ని రౌండ్లలోనూ రాజేంద్ర ప్రసాద్ లీడ్ లో సాగారు.
* ముందు నుండి లీడ్ లో సాగిన రాజేంద్ర ప్రసాద్
* మా ఫలితాల వెల్లడికి ఏడు రౌండ్లలో కౌంటింగ్.
* ఫిలిం ఛాంబర్ లో రాజేంద్ర ప్రసాద్ వర్గం వారు సంబరాలు
* జయసుధ వర్గం వారు కొంత నిరాశతో ఉన్నారు.
* ఫిలిం ఛాంబర్ కు రాని జయసుధ
*ఈ ఓటమికి మురళీ మోహన్ దే బాధ్యత- బాలచందర్
*రాజేంద్ర ప్రసాద్ ను బలపరిచిన నాగేంద్ర బాబు
**అభినవచారి**
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more