బయట వున్నప్పుడు మద్యం, మాంసం లేకుండా ముద్ద దిగేగి కాదు.. ఇప్పుడు ఎలా వున్నాడో బిడ్డా..? రాత్రి అయితే చాలు కనీసం టీవీలో అయినా డాన్సులు చూడకుండా నిద్రపట్టేది కాదు. వారానికి రెండు మూడు రోజులు అలా వెళ్లి డాన్సులను చూసేవాడు బిడ్డ.. ఇప్పడు ఎలా నిద్రపోతున్నాడో ఏమో..? అంటూ అమాయకంగా బిక్కముఖం పెట్టుకుని ఓ తండ్రి తన తనయుడు ఆవేదనను అర్థం చేసుకుని ఆందోళన చెందుతుంటే మీ కేమనిపిస్తుంది. పాపం చిన్న పిల్లోడు కాబోలు పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటర్ విద్యాభ్యాసం కసం హాస్టళ్లో చేరాడని అనుకుంటున్నారా..? అయితే మీరు క్యాబరే లో కాలేసినట్టే..
ఎందుకంటే ఆ తండ్రి దిగులు పడుతున్నది చదవుకునేందుకు వెళ్లిన పిల్లాడి కోసం కాదు. హత్యా నేరం చేసి జైలు కెళ్లిన హంతకుడి కోసం. అప్పుడే షాక్ అయ్యారా..? ముందుంది ముసళ్ల పండగ అన్నట్లు హత్యానేరానికి పాల్పడ్డారన్న అభియోగాలపై జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ కోరాడని.. ఏకంగా జైల్లోకి అమ్మాయిలను రప్పించాడు ఆయన. ఇంతకీ ఎవరాయన అంటారా..? అయనే జైలు లోని ఖైదీలను తండ్రిలా చూసుకోవాల్సిన జైలర్. పంజాబ్లోని చండీగఢ్లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. హత్యానేరం మీద ఆ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న సర్వణ్ సింగ్ అడిగాడని... అనువుగాని చోటని తెలిసినా.. ఇలాంటి చర్యలను అడ్డకోవాల్సి వున్నప్పటికీ.. చేష్టలుడికి చూడటమే కాకుండా.. ఏకంగా అమ్మాయిలను రప్పించి డాన్స్ లు చేయించాడు జైలర్.
గురుదాస్పూర్ జిల్లాలోని ఫతేగఢ్ చురియాన్ గ్రామం నుంచి రూ. 16 వేలు వెచ్చించి మరీ సంప్రదాయ నాట్యబృందాన్ని రప్పించారు. 2013లో భాగుపూర్ ప్రాంతంలో యువజన కాంగ్రెస్ నేత సుఖ్రాజ్ సింగ్ హత్యకేసులో నిందితుడిగా వున్న సర్వణ్ సింగ్.. కోరాడని జైలర్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడట. అసలే జైలు.. అపైన అక్కడున్న వారందరిలోనూ నేర ప్రవృత్తి అధికమే. దీంతో డాన్స్ సందర్భంగా రేగిన గోడవలో సర్వణ్ సింగ్ కు అకాలీదళ్ యువజన నేత కొట్టుకుని పొడుచుకోవడం వరకు వెళ్లింది దీంతో ఈ ఘటన బయటకు వచ్చింది.
ఖైదీలకు ఆహ్లాదం కలిగించేందుకు ముందుగా ఎలాంటి అనుమతి లేకుండా డిప్యూటీ జైల్ సూపరింటెండెంట్ దేవీందర్ సింగ్ రణ్ధవా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు అమృతసర్ జైలు సూపరింటెండెంట్ ఆర్కే శర్మ పంజాబ్ జైళ్లశాఖ ఏడీజీపీ మీనాకు సమర్పించిన నివేదికలో తెలిపారు. వాస్తవానికి పురుషుల జైల్లోకి మహిళలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. రిక్రియేషన్ కాంప్లెక్సులోకి గానీ, సెల్లోకి గానీ పంపకూడదు. దీన్ని ఉల్లంఘించి మరీ ఈ డాన్సు ప్రోగ్రాం ఏర్పాటు చేశారన్న విషయం వెలుగు చూడటంతో.. ప్రస్తుతం దేవిందర్ సింగ్ దణ్ ధవా శాఖా పరమైన విచారణను ఎదుర్కోంటున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more