ఆకాశంలో సగం అంటూ దూసుకుపోతున్న మహిళా లోకం.. భవిష్యత్తులో సమూల మార్పులకు కారణం అవుతారన్న పెద్దల మాటలు అక్షర సత్యాలుగా మారుతున్నాయి. అనాదిగా వంటగదికే పరిమితమైన మహిళలు.. అన్ని రంగాలలో దూసుకుపోతున్నారు. ఆఫీసుల్లో ఉద్యోగాల నుంచి తాజాగా ఆర్టీసీ బస్సులు నడిపే వరకు అన్నింటా తమ సత్తాను రుజువు చేసుకుంటున్నారు. హైదరాబాద్ సహా పలు పట్టణాలలో అడవారి కోసం ప్రత్యేకంగా షీ క్యాబ్ ను నడుపుతున్న మహిళలు.. ఇప్పుడు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ)లో డ్రైవర్ గా కూడా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ బస్సులకు తొలి మహిళా డ్రైవర్ గా ఎంపికైంది మాత్రం తెలుగు వనితే.
దేశ రాజధాని నగరానికి తొలి మహిళా డ్రైవర్‌ను అందించిన ఘనత తెలంగాణలోని నల్గోండ జిల్లా దక్కించుకుంది. జిల్లాకు చెందిన 30 ఏళ్ల వంకదరత్ సరిత తొలి మహిళా డ్రైవర్ గా ఎంపికయ్యారు. ఉత్సాహవంతులైన మహిళా డ్రైవర్లు కావాలన్న ప్రభుత్వ పత్రికా ప్రకటనకు ఏడుగురు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఒక్క సరిత మాత్రమే మెడికల్‌గా ఫిట్‌గా ఉన్నారని డీటీసీ మెడికల్ బోర్డు పరీక్షల్లో తేలింది. దీంతో 28 రోజుల శిక్షణ తరువాత, తొలి మహిళా డ్రైవర్‌గా సరోజినినగర్ డిపో లో ఆమె నియమించారు.
నల్గొండ జిల్లాకు చెందిన పేదరైతు కుటుంబంలో పుట్టిన సరితను మగపిల్లలు లేకపోవడంతో తండ్రి ఆమెను అబ్బాయి లాగా పెంచారు..... తన హెయిర్ స్టయిల్, డ్రెస్సింగ్ స్టయిల్ అంతా నాన్న ఛాయిస్సే అంటున్న సరిత మహిళలు సాధించలేనిది ఏదీ లేదని చెప్పాలన్నదే తన ఉద్దేశ్యమని చాలా ఆత్మ విశ్వాసంతో చెబుతున్నారు. ఇక్కడ బస్సు నడపటం కత్తిమీద సామే అయినప్పటికీ నల్లొండలో ఆటోను, హైదరాబాద్‌లో కాలేజీ మినీ బస్సు నడిపిన అనుభవం బాగా ఉపయోగపడుతోందంటున్నారు. డ్రైవింగ్‌లో సరితకు శిక్షణ ఇచ్చిన పర్వేష్ శర్మ.. ఆమె డ్రైవింగ్ స్కిల్స్ చూసి చాలా అద్భుతంగా వున్నాయంటున్నారు. భవిష్యత్తుల్లో చాలా మంచి డ్రైవర్ అవుతుందంటూ కితాబులిచ్చారు. తమ నిర్ణయం మరింత మంది మహిళలను డ్రైవింగ్ వృత్తిలోకి రావడానికి ఉత్సాహపరుస్తుందని భావిస్తున్నామని ఢిల్లీ ప్రభుత్వం అంటోంది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more