స్టార్ హోటళ్లలో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఎనిమిది మంది సభ్యుల ముఠా గుట్టును గచ్చిబౌలి పోలీసులు రట్టు చేశారు. గచ్చిబౌలి సీఐ జె.రమేశ్ కుమార్ కథనం ప్రకారం... ముంబైకి చెందిన సిమ్రాన్ బేగం(32) అలియాస్ అలీసాబేగం కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్‌లో నివాసముంటుంది. కొండాపూర్ శ్రీరాంనగర్‌లోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంది. గత నాలుగు నెలలుగా ఆన్లైన్లో వ్యభిచారం నిర్వహిస్తోంది. సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా పలు అనుమానాస్పద ప్లాట్‌పై చేసిన దాడుల్లో వ్యభిచారిణులతో పాటు విటులు దోరికారు.
ప్రధాన సూత్రదారి సిమ్రాన్‌తో పాటు డీల్లీకి చెందిన డింపుల్(27), అబ్దుల్ సమద్(42), కరీంనగర్‌కు చెందిన షేక్ యాసిన్(20), షేక్ మోసిన్(20), డ్రైవర్లుగా పనిచేసే ఎండి.షకీల్(23), అబ్దుల్ అజీజ్(23), వైజాగ్ తాళ్లపాలెంకు చెందిన వంట మనిషి సంధ్య(35)లను అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి అసెంట్, ఇండికా కార్లు, 20 సెల్ ఫోన్లు, 9 సిమ్ కార్డులు, ల్యాప్ టాప్, బ్యాంక్ పాస్ బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర బ్యాంక్ అకౌంట్లో రూ.2.50 లక్షలు ఉన్నాయని సీఐ తెలిపారు. బ్యాంక్‌లోని డబ్బును కోర్టుకు అందజేస్తామన్నారు. ఫ్లాట్ యజమానికి నోటీస్ జారీ చేస్తామని చెప్పారు. అతని వివరణ సంతృప్తికరంగా లేకుంటే ఫ్లాట్ సీజ్ చేస్తామని సీఐ రమేశ్ కుమార్ తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more