ఆంధ్రప్రదేశ్ రాజధాని భవనాల నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఎంత గోప్యత పాటిస్తున్నప్పటికీ బయటికొస్తున్న విషయాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెడుతున్నాయి. ఇప్పటికే ఆర్థికపరమైన లోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, వేలాది కోట్ల రూపాయల వ్యయంతో రాజధానిని ఏ విధంగా నిర్మిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాము మాస్టర్ ప్లాను మాత్రమే ఇస్తామని, నిర్మాణంలో జోక్యం చేసుకోబోమని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ శుక్రవారం చేసిన ప్రకటనతో రాజధాని వ్యవహారంలో ఇప్పటి వరకూ ఉన్న అంచనాలు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సింగపూర్ మంత్రి ఈశ్వరన్ రాజధానిని ఎవరు నిర్మించాలనే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదే తుది నిర్ణయమని ఆయన తెలిపారు. సింగపూర్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్‌తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంఓయులో ఏముందో తెలిస్తేగానీ అసలు విషయం బయటికి రాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో పూర్తి గోప్యత పాటిస్తున్నాయి. ఇదే సమయంలో 'పంటపొలాల్లో నిర్మాణాలు చేపట్టొద్దని, అలా చేస్తే ఆహార అభద్రత ఏర్పడుతుందని' సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సూచించినట్లు వార్తలొచ్చాయి. ఇది కూడా రాజధానికి పెద్ద ఎదురుదెబ్బే. అకాశహార్మ్యాలనూ చూపిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తున్న ప్రచారార్భాట బుడగలు మంత్రి ప్రకటనతో నీటిబుడగల్లా పేలిపోతున్నాయి. రాజధాని కోసం పూలింగు ప్రక్రియలో తీసుకున్న భూములన్నీ పుష్కలంగా పంటలు పండేవే. సీడ్ క్యాపిటల్ నిర్మించనున్న ప్రాంతం హరితహారంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ నిర్మిస్తారనేది సమస్యగా మారింది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more