Telugu Music Director Sri aka Srinivasa Chakravarthy Dies of Kidney-Related Ailment

Tributes pour in for music director sri

music director sri passes away, Music Director Sri Is No More, Telugu Music Director Sri aka Srinivasa Chakravarthy, sri Dies of Kidney-Related Ailment, Music Director Sri Died, Music Director Sri,

Popular Tollywood musician Sri, Kommineni Srinivasa Chakravarthy, died at his residence in Hyderabad, He was suffering from some kidney-related ailment for a long time.

సంగీత దర్శకుడు శ్రీకి ప్రముఖుల నివాళులు

Posted: 04/19/2015 01:35 PM IST
Tributes pour in for music director sri


సంగీత దర్శకుడు ‘శ్రీ’ మృతితో తెలుగు సినీ పరిశ్రమ దిగ్ర్భాంతికి లోనైంది. ముఖ్యంగా తెలుగు సంగీత కళాకారులు విషాదంలో మునిగిపోయారు. పలువురు ఆయన భౌతికకాయాన్ని దర్శించుకుని నివాళులర్పించారు. శ్రీ మరణం సినీరంగానికి తీరని లోటని గాయకుడు మనో అన్నారు. ఒక సంగీత దర్శకునికుగానే కాక శ్రీ చక్కని నేపథ్య గాయకుడని ఆయన అన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ ఇక లేరన్న వార్తలను వారు జీర్ణించుకోలేక పోతున్నారు. గత కొంతకాలంలగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి కొండాపూర్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

శ్రీ మృతిచెందడంపై పలువురు రాజకీయ, సీని ప్రముఖులు తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి మృతి పట్ల ఆంద్రప్రదేశ్ విపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన సమకూర్చిన భాణీలు అనేకం పాపులర్ అయ్యాయి. పాప్‌సింగర్‌ స్మితతో కలిసి ‘హాయ్‌ రబ్బా’ ఆల్బమ్‌ను చేశారు. గుణ్ణం గంగరాజు తెరకెక్కించిన ‘చందమామలో అమృతం’ ఆయన ఆఖరి చిత్రం. చక్రి సంగీత దర్శకత్వం వహించిన ‘చక్రం’ (2005) సినిమాలో శ్రీ పాడిన ‘జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది’ పాట పాపులర్‌ అయింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Music director Sri  Sri passes away  

Other Articles