తెలంగాణలో టిడిపి నుండి గెలిచిన నేతలు టిఆర్ఎస్ లో చేరారు. అయితే వారిని టిఆర్ఎస్ ఎల్పీలో గుర్తింపునిచ్చారు. గతంలో టిడిపి నుండి చేరిన వారిని ఎలా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా గుర్తిస్తారని టిడిపి నాయకులు గతంలోనే ప్రశ్నించారు. అయితే ఇలా వివాదాలకు తెర తీసిన పాత తెలుగుదేశం, ప్రస్తుత టిఆర్ఎస్ నేతల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తెలంగాణ శాసనమండలి చైర్మెన్ నిర్ణయంపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చెయ్యడం వార్తల్లో నిలిచింది. టీఆర్‌ఎస్‌ఎల్పీలో టీడీఎల్పీ విలీనంపై న్యాయస్థానం ఈ మేరకు హైకోర్ట్ నోటీసులు ఇచ్చింది. ఏ ప్రాతిపదికన టీడీపీ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ఎల్పీలో విలీనమైనట్లు ప్రకటించారో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
మార్చి 9న టీడీపీ ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, పట్నం నరేందర్‌రెడ్డి, గంగాధర్‌రెడ్డి, ఎండీ సలీంను గుర్తిస్తూ సీట్లు కేటాయించాలని మండలి చైర్మన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ఎల్పీలో టీడీఎల్పీ విలీనమైనట్లుగా అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాం అప్పట్లో ఓ బులెటిన్ కూడా విడుదల చేశారు. దీన్ని సవాల్ చేస్తూ టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. మొత్తానికి ఎన్నో మలుపులు తిరిగిన టిఆర్ఎస్, టిడిపి నేతల వ్యవహారం ఇప్పుడు హైకోర్టు జోక్యంతో మరింత ముదిరింది. మరి హైకోర్ట్ దీనిపై ఏ తీర్పునిస్తుందో వేచి చూడాలి.
**అభినవచారి**
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more