ఆడదానికి మగాడి తోడు కావాలి.. మగాడికి ఆడతోడు కావాలి. కానీ అన్నింటా తోడుగా ఉంటాడని నడిచిన ఓ ఆడదానికి మగాడు అసలు మగాడు కాదని తెలిస్తే ఏం జరుగుతుంది..? ఇదేదో సినిమా స్టోరీలా ఉన్నా నిజం. ఢిల్లీకి చెందిప ఓ డాక్టర్ జంటకు ఎదురైన యదార్థ ఘటన. పాపం తన భర్త మగాడు కాదు అన్న నిజాన్ని ఎన్నో ఏళ్లు దిగమించిన ఆ మహిళ చివరకు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. చనిపొయే ముందు తన భర్త గురించి లోకం మొత్తం విస్తుపోయే నిజాలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి మరీ చనిపోయింది. ఆ మగాడి కథ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే..
ఎయిమ్స్‌లో అసస్థీషియా స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్న ప్రియకు, డెర్మటాలజిస్ట్‌గా పనిచేస్తున్న కమల్‌కు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరు దక్షిణ ఢిల్లీలోని ఎయిమ్స్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఈ స్థితిలో సెంట్ర ఢిల్లీలోని ఒక హోటల్లో భర్తతో కసిలి బసచేసిన ప్రియ శనివారం రాత్రి మణికట్టును కోసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల దర్యాప్తులో ఆమే రాసిన సుసైడ్ నోట్ చిక్కింది. అందులో 'వీడు పెడుతున్న అపరిమితమైన మానసిక హింసను తట్టుకోలేకనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నాను' అంటూ రాసింది. పెళ్లయిన తరువాత కమల్ నపుంసకుడని తెలిసినా సర్దుకుపోయానని, కానీ, పరిస్థితిని తాను చనిపోయేవరకూ తీసుకువచ్చాడని సుదీర్ఘ లేఖ రాసింది. తాను 'గే' నన్న విషయాన్ని కమల్ దాచిపెట్టాడని, కట్నం కోసం వేధించాడని ఆమె లేఖలో ఆరోపించింది.
ఆమె చనిపోయే ముందు ఫేస్ బుక్ ఖాతాలో ఒక పోస్ట్ పెడుతూ "నేను నీతోనే ఉండాలని అనుకున్నాను. ఎందుకంటే నేను నిన్ను ఎంతో ప్రేమించాను కాబట్టి. నీ లోపాన్ని కూడా భరించాను. కానీ, నువ్వు నా జీవితానికి ఓ క్రిమినల్‌గా మారావు. నీ కుటుంబానికి ఈ విషయాలు తెలీవు. నువ్వో దయ్యానివి" అని పేర్కొంది. కాగా అదే రోజు కమల్ తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఆమె కోసం వెతికిన పోలీసులకు మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఆమె రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి డాక్టర్‌ను అరెస్టు చేసి, విచారిస్తున్నారు.
**అభినవచారి**
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more