Bikini | Ladies | China | Contest

Ladies cat walked on a mountain with wearing bikini

cat walk, bikini, mountain, china, miss bikini of the universe, ladies,

Ladies cat walked on a mountain with wearing bikini. The mountain nearly two thousand meters from sea level. But ladies ready to proove that they are beautiful.

చావు అంచుల్లో అందాలు ఆరబోస్తున్న ఆడవాళ్లు

Posted: 04/22/2015 01:25 PM IST
Ladies cat walked on a mountain with wearing bikini

అందం అంటేనే ఆడవాళ్లు.. ఆడవాళ్లు అంటే అందం. అందుకే కవులు కూడా ప్రకృతిని, ఆడవాళ్లను అందానికి ఉదాహరిస్తారు. అయితే అందం ఆడవాళ్లకు సొంతమే అయినా వారిలో అందానికి చాలా మంది మరీ ఎడిక్ట్ అయిపోతుంటారు. అలా ఎడిక్ట్ అయిన ఆడవాళ్లు అందం కోసం ఏమైనా చేస్తారు. చివరకు చావనైనా చస్తారని పెద్దోళ్లు తిడుతుంటారు. ఆ మాట నిజమేననిపిస్తుంది ఈ భామలను చూస్తే. బికినీలు వేసుకొని ర్యాంప్‌ పై ఎవరైనా క్యాట్‌ వాక్‌ చేస్తారు. కానీ వీళ్లు మాత్రం సముద్రమట్టానికి 2వేల మీటర్ల ఎత్తులో కొండవాలులపై క్యాట్‌ వాక్‌ చేసి అందగత్తెలమనిపించుకోవడానికి ఏసాహసానికైనా సిద్ధమని నిరూపించారు.

ప్రతీ ఏటా చైనాలో మిస్‌ బికినీ ఆఫ్‌ ది యూనివర్స్‌ కంటెస్ట్‌ నిర్వహిస్తారు. 10ఏళ్లుగా ఈ కంటెస్ట్‌ జరుగుతోంది. ఇందులో స్పెషల్‌ ఎంటంటే... బికీనీ భామలు సాహసోపేతమైన పనులు చేయాల్సి ఉంటుంది. ఇలా ఎత్తైన కొండ వాలులపై క్యాట్‌ వాక్‌ చేయడం లాంటివన్నమాట. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. కాస్త అటు ఇటుగా నడిచినా సరే ఇక అంతే.. పైలోకాలకు పోవాల్సిందే. కేవలం కొండలపైనే కాదు.. అద్దాలపై ఎత్తు చెప్పులు వేసుకొని కూడా ఎత్తైన కొండవాలులపై నడవాల్సి ఉంటుంది. అందంతో పాటు మానసిక ప్రశాంతత కూడా అవసరమని ముఖ్యంగా ఇలాంటి సాహసాలు చేస్తున్నప్పుడు ప్రశాంత మనుసుతో చేస్తే గెలుపు ఖాయమని చెప్పడమే ఈ బికీనీ కంటెస్ట్‌ ఉద్దేశ్యం. మొత్తానికి అందంగా ఉన్నాం చెప్పడానికి సాహసాలు కూడా చెయ్యడం నిజంగా విశేషమే. అయితే తమ అందాన్ని అందరూ మెచ్చుకోవాలన్నది ఆడవారి అసలు ఉద్దేశం మరి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cat walk  bikini  mountain  china  miss bikini of the universe  ladies  

Other Articles