Ap | Inter | Result | First Year | Krishna

Ap intermediate first year results out now

ap, inter, first year, ganta, srinivas, krishna, kadapa

Ap intermediate first year results out now. Minister ganta srinivas released inter results. Krishbna dist. got first place by getting 76%, kadapa dist last in the result by getting 59%

ఏపి ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ విడుదల

Posted: 04/23/2015 05:43 PM IST
Ap intermediate first year results out now

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు  ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో క్రిష్ణా జిల్లా 76 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలవగా, 59శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. 62.98  శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 4,61,932 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, బాలుర ఉత్తీర్ణత శాతం 59 గాను, బాలికల ఉత్తీర్ణత శాతం 67 గాను నమోదైంది. ఎప్పటిలాగే బాలుర కంటే బాలికలే ఎక్కువ శాతం ఉత్తీర్ణులయ్యారు. జనరల్లో 52.13 శాతం మందికి ఎ గ్రేడ్, 24.08 శాతం మంది బి గ్రేడ్, 13 శాతం మంది సి గ్రేడ్, 6.10 శాతం మంది డి గ్రేడ్లో పాసయ్యారని, ఒకేషనల్లో 60 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని గంటా శ్రీనివాసరావు తెలిపారు.  

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  inter  first year  ganta  srinivas  krishna  kadapa  

Other Articles