US woman jailed after McDonald's shooting over bacon-less burger

Us woman jailed after mcdonalds shooting over burger washington

us woman jailed after mcdonalds shooting over burger, US woman jailed after McDonald's shooting, bacon-less burger, washington, hamburger was delivered twice without bacon, Michigan woman sentenced three to seven years in prison, US woman, jailed, McDonald's, Shaneka Monique Torres,

A Michigan woman was sentenced three to seven years in prison after firing her gun at a McDonald's drive-through when her hamburger was delivered twice without bacon, local media reported

మెక్ డోనాల్డ్ లో బర్గర్ తిన్నందుకు జైలు శిక్ష..!

Posted: 04/23/2015 04:48 PM IST
Us woman jailed after mcdonalds shooting over burger washington

అమెరికాలో మిచిగన్ ప్రాంతంలోని మెక్ డోనాల్డ్ కన్ ఫెక్షనరీకి వెళ్లి బర్గర్ తిన్నందుకు ఓ అమెరీకన్ మహిళకు ఆ దేశంలోని న్యాయస్థానం జైలు శిక్షను విధించింది. అదేంటబ్బా అమెరికాలోని వాళ్లు అధికంగా కన్ ఫెక్షనరీ ఫుడ్ పైనే ఆధారపడతారు కదా..? అలాంటిది.. బర్గర్ తింటే జైలు శిక్ష ఎందుకు విధించారనేగా మీ సందేహం. అమెరికాలో మెక్ డోనాల్డ్ కన్ఫెక్షనరీ బెకరీలలో తినరాదని, ఎక్కడా ఎలాంటి అదేశాలు లేవు.. ఒక వేళ అతిక్రమించినా జైలు శిక్ష విధిస్తామన్న హెచ్చరికలు కూడా లేవు. అలాంటప్పుడు అమెరికన్ మహిళకు జైలు శిక్ష ఎందుకు విధించారని అనుమానాలు వస్తున్నాయి కదూ..? అక్కడికే వస్తున్నాం.

మిచిగన్ ప్రాంతానికి చెందిన శనేకా మోనిక్యూ టొర్రెస్ కు అక్కడి న్యాయస్థానం మూడు నుంచి ఏడేళ్ల లోపు జైలు శిక్ష ను విధించింది. తన స్నేహితురాలితో కలసి స్థానికంగా వుంటే మెక్ డొనాల్డ్ కన్ఫెక్షనరీ కి 2014 ఫిబ్రవరి10 రాత్రి  మెక్డొనాల్డ్స్ కి వెళ్లింది. మీల్తో పాటూ బేకన్ చీస్ బర్గర్ ఆర్డర్ చేసింది. మీల్ వచ్చినా బెకన్ సర్వ్ చేయలేక పోవడంతో అమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కన్ఫెక్షనరీ మేనేజర్ ..శనేకాకు క్షమాపణ చెప్పి మీల్ని ఉచితంగా ఇస్తానని చెప్పాడు. అదే రోజు కొన్ని గంటల తర్వాత శనేకా తిరిగి మెక్డొనాల్డ్స్కి  వచ్చింది.  

ఈ సారి కూడా ఆమె బర్గర్ ఆర్డర్ చేసింది. అప్పుడు కూడా బేకన్ లేకుండానే మీల్ ఇవ్వడంతో ఆగ్రహం పట్టలేని శనేకా మోనిక్యూ టొర్రెస్ తన వెంట తెచ్చుకున్న గన్తో ఎడాపెడా కాల్చేసింది.  అదృష్టవశాత్తు ఈ కాల్పుల్లో ఎవరికి గాయాలు కాలేదు. దాంతో అమ్మడిపై మెక్డొనాల్డ్స్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు విచారణ సందర్భంగా... కాల్పులు అనుకోకుండా జరిగిన సంఘటనగా పరిగణించాలని శనేకా మోనిక్యూ తరపు న్యాయవాది కోరినా లాభం లేకుండా పోయింది. శనేకా మోనిక్యూకు న్యాయస్థానం మూడు నుంచి ఏడేళ్లలోపు శిక్ష విధించిది. అదన్నమాట.. మెక్ డోనాల్డ్ కు వెళ్లినందుకు కాదు.. కాల్పులు జరిపినందుకు జైలు శిక్ష్ పడిందన్నమాట

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : US woman  jailed  McDonald's  Shaneka Monique Torres  

Other Articles