Bharath | India | PIL | Supremecourt

Pil on change the name of india to bharath

Bharath, India, PIL, Supremecourt, delhi, govt, name,

PIL on change the name of India to Bharath. A pil on supreme court about india name changed to Bharath. The court ask reposnce on changing name to Bharath.

'ఇండియా' కాదుకాదు 'భారత్' నా మాతృభూమి?!

Posted: 04/25/2015 01:59 PM IST
Pil on change the name of india to bharath

భారతదేశం నా మాతృభూమి.. అని చదువుకున్నాం. మన తరువాత తరాలు కూడా అదే విషయాన్ని చదువుకుంటాయి కూడా. అయితే భారతదేశం పేరు మీద వివాదం నడుస్తోంది. ఇంతకీ వివాదం ఏంటీ అని అనుకుంటున్నారా.. ఇంతకీ మన దేశం పేరు ఇండియానా, భారతా.. ఎంతో మంది మెదడులలో ఉండే ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి తెలుసు.. సమాధానం రెండు పేర్లు కరక్టే! కానీ రెండింటిలో ఏది అసలు పేరు అన్నది ప్రశ్న. అయితే ప్రాచీన కాలం నుండి భారత్ అనే పేరే ఉందని కానీ ఇంగ్లాండ్ వారు వ్యాపారానికి వచ్చిన తర్వాత భారత్ అనే పేరు వాడకం తగ్గింది. దాంతో వారు మన దేశాన్ని ఇండియా అని పిలవడం మొదలు పెట్టారు. అయితే మన దేశానికి భారత్ అనే పేరునే పెట్టాలన్న డిమాండ్ వార్తల్లోకెక్కింది. ఈ విశేషాలు మీ కోసం..

ఇండియా పేరును భారత్‌గా మార్చాలని డిమాండ్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన పిటిషన్(పిల్)పై స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు, న్యాయమూర్తి అరుణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా నోటీసు జారీచేసింది. ప్రభుత్వ వ్యవహారాల్లో, అధికార పత్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఇండియా అనే పేరును వాడకుండా చూడాలంటూ మహారాష్ట్రకు చెందిన నిరంజన్ భత్వల్ ఈ పిల్ దాఖలు చేశారు. స్వచ్ఛందసంస్థలు, కార్పొరేట్ సంస్థలు కూడా అధికార, అనధికార వ్యవహారాల్లో భారత్ పేరును వాడేలా ఆదేశించాలనీ కోరారు. రాజ్యాంగ శాసనసభలోనూ మన దేశానికి భారత్, హిందుస్థాన్, హింద్, భరత్‌భూమి లేదా భరత్‌వర్ష్ వంటి పేర్లు పెట్టాలనే సూచనలు వచ్చాయని గుర్తుచేశారు. ఇతర దేశాలు చట్ట ప్రకారం దౌత్య అవసరాలకోసం మనదేశాన్ని గుర్తించటానికే ఇండియా పేరును జోడించారా?అనేది తెలపాలనీ ప్రశ్నించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bharath  India  PIL  Supremecourt  delhi  govt  name  

Other Articles