Mallimasthababu | Funeral | AP | Nellore

Malli masthan babu funeral programmee complted in nellore

malli masthan babu, mountain, argentina, chili, ap, everest,

Malli masthan babu funeral programmee complted in nellore. Ap govt arrange officail arrangements for malli masthan babu funeral..

మల్లి మస్తాన్ బాబు.. మళ్లి ఎప్పుడొస్తావ్

Posted: 04/25/2015 01:14 PM IST
Malli masthan babu funeral programmee complted in nellore

సాహసమే ఊపిరిగా జీవించిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు తిరిగి రాని లోకాలకు పయనమయ్యారు. ప్రభుత్వం లాంఛనాలతో  హిందూ సంప్రదాయం ప్రకారం మల్లి మస్తాన్ బాబు స్వగ్రామం గాంధీజనసంగంలో అంత్యక్రియులు జరగాయి. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మస్తాన్ బాబు భౌతికకాయానికి నివాళులు అర్పించారు మల్లి మస్తాన్ బాబు స్మృతులను  వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు. మస్తాన్ బాబు అదృశ్యమైన దగ్గర నుంచి ఆతని ఆచూకీ కోసం తీవ్రప్రయాత్నాలు చేశామని,  అయినప్పటికీ ప్రాణాలతో కనుగొనలేకపోవటం దురదృష్టకరమన్నారు.మంత్రులు నారాయణ, పల్లె రఘునాధరెడ్డి, రావెల కిషోర్ బాబు, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు మస్తాన్ బాబు భౌతికకాయానికి అంజలి ఘటించారు. మరోవైపు మస్తాన్ బాబును కడసారి చూసేందుకు బంధువులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

గౌరవ సూచికంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు మూడుసార్లు గాల్లో కాల్పులు జరిపారు.  పర్వతారోహణలో దేశ కీర్తిని ప్రపంచ నలుదిక్కులా చాటిన మస్తాన్‌బాబును....కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఇక సెలవు వీరుడా అంటూ... కన్నీటితో సాగనంపారు. అశ్రునయనాలు... మస్తాన్ బాబు అమర్‌ రహే నినాదాల నడుమ.... నింగికెగసిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు అంత్యక్రియలు ముగిశాయి. మల్లి

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : malli masthan babu  mountain  argentina  chili  ap  everest  

Other Articles