ఆడవాళ్లు అబలలు కాదు సబలలు అని మరో వనిత.. కాదు కాదు తొమ్మిది నెలలు నిండిన నిండు గర్భిణీ రుజువు చేసింది. ఇక లక్ష్యాన్ని నిర్ధేశించుకుంటే.. దానిని ఎంతటి కష్టమైనా సాధించగలమని నిరూపించింది. కరీంనగర్‌కు చెందిన కామారపు లక్ష్మి(43) అనే తొమ్మిది నెలల గర్భిణీ 5 కిలోమీటర్ల దూరం పరుగెత్తి అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమేకాదు, 'తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించింది. ఆదివారం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో 5 కిలోమీటర్ల దూరాన్ని 30 నిమిషాల 20 సెకన్లలో చేరుకుని రికార్డు నెలకొల్పింది.
ప్రత్యక్షంగా తిలకించిన తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఆమెకు గుర్తింపు పత్రం అందజేశారు. నిండు గర్భిణీగా ఉండి, 5 కిలోమీటర్ల దూరం పరుగెత్తటం తెలంగాణ రాష్ట్రంలో ఇదే ప్రథమమని తెలిపారు. గిన్నిస్ బుక్ నిర్వాహకులకు కూడా సిఫారసు చేయనున్నట్లు పేర్కొన్నారు. తల్లి గర్భంలో వున్న అఢ శిశువులను పరిరక్షించాలని కోరుతూ.. గ్రామాల్లోని చెరువులను కూడా పరిరక్షించాలన్న నినాదంతో లక్ష్్మీ చేసిన సాహసాన్ని గ్రామస్థులందరూ ప్రశంసించారు. కాగా క్రీడాకారిణి అయిన లక్ష్మి భర్త రవీందర్ కూడా క్రీడాకారుడే. వారికి మూడేళ్ల కూతురు ఉంది. ఈ వారంలోనే ఆమెకు కాన్పు కానుందని తెలిసింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more