Rajinikanth | Ramdev baba | Padma award | Padma vibhushan

Central committee on padma awards dismiss rajinikanth ramdev baba names from the list

Padma award, Padma vibhushan, central committee, Govt, rajinikanth, Ramdev baba

Central committee on Padma awards dismiss Rajinikanth, Ramdev baba names from the list. The central committee review on padma awards list. Ramdev baba clear that he is not ready to take padma award.

పద్మ అవార్డుల జాబితా నుండి రజినీకాంత్, రాందేవ్ బాబా పేర్లు తొలగింపు

Posted: 04/28/2015 08:09 AM IST
Central committee on padma awards dismiss rajinikanth ramdev baba names from the list

ఈ ఏడాది పద్మ అవార్డులకు సిఫారసు చేయబడి ఆ తర్వాత పేర్లు తొలగించిన 1,793 మంది ప్రముఖ వ్యక్తుల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్, యోగా గురువు రామ్‌దేవ్ బాబా, బిజెపి నాయకుడు, బాలీవుడ్ సీనియర్ నటుడు శతృఘ్నసిన్హా తదితరులు ఉన్నారు. ఆధ్యాత్మిక నాయకురాలు మాతా అమృతానందమయి, భారత్‌లో అమెరికా రాయబారిగా పనిచేసిన రాబర్ట్ బ్లాక్‌విల్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, ప్రముఖ నేపథ్య గాయకుడు ఉదిత్ నారాయణ్, పారిశ్రామికవేత్త బ్రిజ్ మోహన్‌లాల్ ముంజల్ తదితరులను కూడా సిఫారసు చేసినప్పటికీ వారి కూడా పద్మ అవార్డులకు ఎంపిక కాలేదు.

2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ అవార్డు అందుకున్న రజనీకాంత్‌ను ఈసారి రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్’ అవార్డుకు సిఫారసు చేశారు. అయితే ఈ ఏడాది మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు బిజెపి అగ్రనేత ఎల్.కె.అద్వానీ, ప్రకాష్ సింగ్ బాదల్, బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్‌లను పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి. ఈ ఏడాది పద్మ అవార్డులకు సిఫారసు చేయబడిన ఇతర ప్రముఖుల్లో మళయాళ సినీ స్టార్ మోహన్‌లాల్, జమ్మూ-కాశ్మీరు బిజెపి నేత దరాక్షన్ అంద్రాబీ, అథ్లెట్ అంజూ బాబీ జార్జ్, బ్యుటీషియన్ షహనాజ్ హుసేన్, సినీ నిర్మాత రోహిత్ శెట్టి, అపోలో హాస్పిటల్స్ ఎండి ప్రీతా రెడ్డి, సినీ దర్శకుడు మధుర్ భండార్కర్ తదితరులు ఉన్నారు. ఈ ఏడాది పద్మ అవార్డులకు పేర్లను ఖరారు చేయడానికి ముందే తాను ఈ అవార్డును స్వీకరించబోనని రామ్‌దేవ్ బాబా ప్రకటించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Padma award  Padma vibhushan  central committee  Govt  rajinikanth  Ramdev baba  

Other Articles