TRS | Hyderabad | Meeting | KCR | Chandrababu | Golden Telangana

Trs party farmation day meeting in hyderabad very sucessfully

TRS, Hyderabad, Meeting, KCR, Chandrababu, Golden Telangana

TRS party farmation day meeting in hyderabad very sucessfully. TRS President KCR attacked on ap cm chandrababu naidu. KCR said that we fight for Telangana in the past but now we have to fight for golden telangana.

టిఆర్ఎస్ బహిరంగ సభ హిట్.. ఏపి సిఎంపై కేసిఆర్ విమర్శలు

Posted: 04/28/2015 08:47 AM IST
Trs party farmation day meeting in hyderabad very sucessfully

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్రీయ సమితి పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన కేసిఆర్ 14వ పార్టీ ఆవిర్భావ సభ అదిరిపోయింది. తెలంగాణ పది జిల్లాల నుండి భారీగా జనాలు బహిరంగ సభకు హాజరయ్యారు. తెలంగాణలో అధికరంలోకి వచ్చిన తర్వత మొదటి ఆవిర్భావ దినోత్సవం కావడంతో టిఆర్ఎస్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. 'పోరాడి తెచ్చుకున్న తెలంగాణను గుంటనక్కల పాలుకాకుండా చూడటంతోపాటు బంగారు తెలంగాణను సాధించి మీ కల సాకారం చేసేవరకు విశ్రమించను అని కేసిఆర్ వెల్లడించారు. నా వెంట నడవండి... అందరూ చిరునవ్వుతో కళకళలాడే తెలంగాణ రావాలి. మీ కల సాకారం చేస్తానని అన్నారు. వచ్చే మూడు, మూడున్నరేళ్లలో హైదరాబాద్‌ను డల్లాస్ నగరాన్ని తలదన్నేలా తయారు చేసి మీకు బహుమతిగా ఇస్తా' అని తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ స్పష్టంచేశారు. ఆనాటి స్వప్నం తెలంగాణ సాధించుకోవడమైతే, ఈనాటి స్వప్నం బంగారు తెలంగాణను తయారు చేయడమన్నారు. ప్రతి బిడ్డ ముఖం బంగారు నాణెంలా వెలిగినప్పుడే ఆ కల సాకారమైనట్లన్నారు. ప్రత్యేక రాష్ట్రం కలను సాకారం చేసిన ఘనత ప్రజలదే. ఈ విజయం వారికే అంకితం అని పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మళ్లీ తన మార్క్ చూయించారు. ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. పక్క రాష్ట్రంలో కిరికిరినాయుడున్నాడని తన స్టైల్ లో విమర్శలు చేశారు. చంద్రబాబు అక్కడ చెప్పినవి చేయడం లేదని.. డ్వాక్రా మహిళకు రుణమాఫీ అని చేయలేదని.. రైతులకు రుణమాఫీ అని సగంమందికి కూడా ఇవ్వకుండా గోల్‌మాల్ చేశారని విమర్శించారు. తాము 34 లక్షలమందికి ఇస్తామని హామీ ఇచ్చాం..  ఇచ్చేశామని అన్నారు. మాట ఇచ్చామంటే తల తెగిపడినా వెనక్కుపోమని..  అక్కడ మీడియా మేనేజ్‌మెంట్ తప్ప ప్రజాసంక్షేమం లేదని చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. కన్నతండ్రికి అన్నంపెట్టనోడు పినతండ్రికి బంగారు నాణెం చేయిస్తానన్నట్లుగా ఉందని కేసిఆర్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  Hyderabad  Meeting  KCR  Chandrababu  Golden Telangana  

Other Articles