Rahul gandhi | Padayathra | Congress | Landbill

Rahul gandhi may lead to padayathra on farmersproblems

Rahul gandhi, Padayathra, Congress, Landbill, NDA, Modi, Farmers,

Rahul gandhi may lead to padayathra on farmersproblems. Congress vice president rahul gandhi decided to do a padayathra on farmers problems and also to public the anti farmer policy of NDA govt.

పాదయాత్రకు పోదాం చలో చలో అంటున్న రాహుల్ గాంధీ

Posted: 04/28/2015 11:03 AM IST
Rahul gandhi may lead to padayathra on farmersproblems

భూ సేకరణ బిల్లును నిరసిస్తూ కిసాన్ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ... దేశవ్యాప్తంగా వ్యవసాయ సంక్షోభంపై తాజాగా 'కిసాన్ పాదయాత్ర' చేపట్టనున్నారు. రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా చోటుచేసుకుంటున్న మహారాష్ట్రలోని విదర్భ, లేదా తెలంగాణలోని మెదక్ జిల్లా నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. పార్టీ శ్రేణులను ఉత్తేజపర్చడంతో పాటు రైతులను పార్టీకి చేరువచేయడం కోసం రాహుల్ పాదయాత్ర ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు.

ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు తీరని నష్టం కలుగుతోందని అంటున్నారు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏర్పాటైన ఎన్డీయే సర్కార్ గత కొంత కాలంగా భూసేకరణ చట్టాన్ని తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ కాంగ్రెస్ తో సహా విపక్షాలు భూసేకరణ చట్టాన్ని అడ్డుకుంటున్నాయి. అయితే భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యడంతో పాటు, ప్రజల్లోకి వెళ్లడానికి వీలవుతుందని రాహుల్ గాంధీ పక్కాగా ప్లాన్ చేసినట్లు సమాచారం. మొత్తానికి లాంగ్ టూర్ తర్వాత తిరిగి వచ్చిన రాహుల్ గాంధీ ఎన్డీయే సర్కార్ పై మాటల తూటాలు పేలుస్తున్నారు. మరి రాహుల్ పాదయాత్ర ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul gandhi  Padayathra  Congress  Landbill  NDA  Modi  Farmers  

Other Articles