తెలుగు రాష్ట్ర విడిపోయి రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాన్ని అలా మారుస్తాం ఇలా మారుస్తాం అంటూ బీరాలు పోతున్నారు. ఫలానా దేశంలో అభివృద్ది సూపర్ అందుకే మన దగ్గర వారి కన్నా బంపర్ చేసి చూపిద్దాం అంటూ మీడియా ముందు తెగ వాగుతున్నారు. ఏపి ముఖ్యమంత్రి ముందు నుండి హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుంది. అన్ని దేశాలను తిరగి అక్కడి కొత్త టెక్నాలజీని వాడుకోవడం.. అక్కడి పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పర్చడం నారా చంద్రబాబు నాయుడుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో. అయితే తెలుగు రాష్ట్రం విడిపోయి ఏపి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత చంద్రబాబు తెగ సింగపూర్ జపం చేస్తున్నారు. ఎంతలా అంటే ప్రతి విషయాన్ని సింగపూర్ తో పోలుస్తున్నారు. సింగపూర్ లో పరిశ్రమలకు అనుమతులు ఇలా ఇస్తారు.. సింగపూర్ లో రోడ్ల వ్యవస్థ ఇలా ఉంటుందని.. ఏకంగా మన మంత్రులకు కూడా అసలు ఏపిలో ఉన్నామా లేక సింగపూర్ లో ఉన్నామా అన్న అనుమానం కలిగేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసే ప్రతి పనికి ఏదో రకంగా సమాధానం ఇస్తున్నారు. అయితే ఏపి సిఎం ఏకంగా సింగపూర్ కలను ప్రజలకు చూపిస్తు.. అక్కడి వారిని ఊహాలోకంలోకి తీసుకెళుతున్నారు. అందుకే కాబోలు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా సింగపూర్ పేరు కాకుండా వేరే ధీటైన నగరాన్ని ప్రతిపాదిస్తున్నారు. డల్లాస్ లాగా హైదరాబాద్ నగరాన్ని సుందరంగా తయారు చేస్తామని అంటున్నారు. అంతేనా ఇప్పటికే అక్కడి రవాణా వ్యవస్థను కాపీ కొట్టిన కేసిఆర్ భవిష్యత్ లో మరి ఎన్ని కాపీలు కొడతారో చూడాలి. మొత్తానికి ఏపి ముఖ్యమంత్రి సింగపూర్ నినాదం, తెలంగాణ ముఖ్యమంత్రి డల్లాస్ విధానం ఎంత వరకు లాభం చేకూరుస్తాయో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more