ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడిఎంకే పార్టీ అదినేత్రి జయలలిత ఆస్తుల కేసులో అప్పీలుపై విచారణకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాదిగా భవానీసింగ్ నియామకం చెల్లదని దేశ సర్వోన్నత సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పుచెప్పింది. ప్రభుత్వానికి హక్కు, అధికారం లేదని, చట్టప్రకారం ఇది మోసపూరితమైన చర్య అని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పుపై అప్పీలు చేసుకునే అవకాశం లేదని తోసిపుచ్చింది. భవానీసింగ్ నియామకం చెల్లనంత మాత్రాన జయ ఆస్తుల కేసును మళ్లీ విచారించాల్సిన అవసరం లేదని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. దేశంలో అవినీతి, లంచగొండితనం పెరిగిపోయి దీర్ఘకాలిక వ్యాధిగా మారిపోయిందని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీన్ని నిర్మూలించేలా తీర్పుచెప్పాలని సూచించింది.
అవినీతి రహిత సమాజాన్ని ఆశిస్తున్నట్లుగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం సృష్టించాయి. జయకు జైలు జీవితం ఖాయమనే ఊహాగానాలు బయలుదేరగా, ప్రతిపక్షాలు సంబరం చేసుకుంటున్నాయి. భవానీసింగ్‌పై తీర్పు నిజాయితీకి, న్యాయానికి కలిగిన విజయమని డీఎంకే అధినేత కరుణానిధి హర్షం వ్యక్తం చేశారు. నిందితులుగా నిర్ధారణ అయిన వారే తమకు అనుకూలమైన వ్యక్తిని ప్రభుత్వ న్యాయవాదిగా నియమించుకోవడం ఈ కేసు విచారణలో వినోదమని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఇళంగోవన్ అన్నారు. అందుకే కోర్టు సరైన తీర్పును వెల్లడించిందని వ్యాఖ్యానించారు. జయ ఆస్తుల కేసుపై కర్ణాటక ప్రత్యేక కోర్టు గత ఏడాది సెప్టెంబరు 27వ తేదీన నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more