Farmers who commit suicide are cowards, criminals, says Haryana minister OP Dhankar

Haryana agriculture minister op dhankar says farmers committing suicide are cowards

Farmers who commit suicide are cowards and criminals, Suicide is a crime as per Indian law, Haryana Agriculture Minister OP Dhankar, farmers suicide, Haryana, OP Dhankar, Haryana minister OP Dhankar,

Even as suicides by farmers’ are on rise and the issue has caught national attention, a minister in Haryana government has put his foot solidaly in his mouth by declaring these farmers were cowards’, rahul gandhi, congress, jibe over dhankar remarks

అప్పుడు బండారు.. ఇప్పుడు దన్కర్.. రైతులంటే ఎందుకంత అలుసు..?

Posted: 04/29/2015 12:49 PM IST
Haryana agriculture minister op dhankar says farmers committing suicide are cowards

అధికారం వచ్చిదంటే చాలు.. తామేమైనా మాట్లాడవచ్చని భావిస్తున్నారు అధికార పక్షానికి చెందిన వారు. సరిగ్గా పదేళ్ల క్రితం అప్పటి ఎన్డీఏ ప్రభుత్వ హాయంలో అటల్ బీహారీ వాజ్ పాయ్ ప్రధానిగా వున్న సమయంలో అప్పటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రైతులను చులకన చేసి మాట్లాడారు. రైతులు తిండి లేక చనిపోవడం లేదని, తిన్నది అరక్క చనిపోతున్నారని వారి ఆత్మహత్యలను చులకన చేశారు. ఇప్పడు మళ్లీ అదే రిపీట్ అయ్యింది. అయితే ఈ సారి హర్యానాలోని అధికార బీజేపికి చెందిన వ్యవసాయ శాఖ మంత్రి రైతుల ఆత్మహత్యలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు పిరికివాళ్లు, క్రిమినల్స్ అని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. అలాంటివారికి తాము ఎందుకు సాయం చేస్తామని మంత్రి ఓం ప్రకాష్ ధన్కర్ ప్రశ్నించారు. భారతీయ చట్టాల ప్రకారం ఆత్మహత్యలు చేసుకోవటం నేరమని ధన్కర్ అన్నారు.  చట్టాన్ని అతిక్రమించి ప్రాణాలు తీసుకునేవారు చట్టప్రకారం నేరస్తులేనని, అటువంటి వారికి ప్రభుత్వం సాయం చేయదని ఆయన పేర్కొన్నారు.  పిరికివాళ్లే ఆత్మహత్యలు చేసుకుంటారని, తమ బాధ్యతల నుంచి తప్పించుకోవటానికి ఆత్మహత్యలను చేసుకుంటున్నారని ధన్కర్ విమర్శించారు.

ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకూడదన్నారు. ఓ వైపు రైతుల ఆత్మహత్యలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో మంత్రి అనాలోచిత వ్యాఖ్యలు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ చేపడుతున్న భూ సంస్కరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా దాని మిత్రపక్షాలు ఉద్యమాలకు పిలుపునిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన మంత్రులు, నేతలు రైతులను చులకన చేసి మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : farmers suicide  Haryana  OP Dhankar  

Other Articles