కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దీర్ఘకాలిక సెలవు నుంచి తిరిగి వచ్చిన తరువాత.. కాంగ్రెస్ పగ్గాలను అనధికారికంగా చేతపుచ్చుకున్నాడు. వచ్చి రావడంతోనే రైతుల పక్షాన నిలిచిన రాహుల్.. భూ సంస్కరణ చట్టంలో సవరణలకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గోన్నారు. కాంగ్రెస్ పక్షాన అన్ని తానై పోరాడేందుకు సంసిద్దుడైన రాహుల్.. తన ఇమేజ్ ను పెంచుకోవడం.. కన్నా దేశంలోని ప్రజల సమస్యలను ఎత్తిచూపి వారి పక్షాన నిలవడంపై దృష్టి సారించాడు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి సరిగ్గా పదకోండు మాసాలు కావస్తున్న తరుణంలో రాహల్ తోలిసారి పార్లమెంటులో ప్రధానిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు.
బుధవారం పార్లమెంటులో రైతుల సమస్యలపై గళమెత్తిన రాహుల్ గాంధీ.. మీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా అంటూ ప్రచారం చేస్తుందని, యావత్ దేశానికి అన్నం పెడుతున్న రైతన్న సకాలంలో పంటలు పండిస్తున్న రైతుల మేక్ ఇన్ ఇండియా చేయడంలేదా అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రైతలు పట్ల గుడ్డిగా వ్యవహరిస్తుందని, దేశంలో దృతరాష్ట్రుడి పాలన సాగుతుందని ఎద్దేవా చేశారు. దేశంలో కరువు విలయతాండవం చేస్తుంటే.. ప్రభుత్వం కనీసం రైతులను, రైతు కూలీలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
పంటలు పండక రైతులు అకలికి అలమట్టిస్తూ.. తమ దీన పరిస్థితిని తలుచుకుని కుటుంబాన్ని పోషించే స్తోమత లేక మరణమే శరణ్యమని అత్మహత్యలకు పాల్పడుతుండగా, వాటిని కూడా బీజేపి నేతలు అపహాస్యం చేస్తున్నారని రాహుల్ దుయ్యబట్టారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఎందుకు చెల్లించాలని ప్రశ్నించిన హర్యానా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఓం ప్రకాష్ దన్కర్ వ్యాఖ్యాలను రాహుల్ గాంధీ పార్లమెంటులో ఊటంకించారు. ఆత్యహత్యలు చేసుకునే రైతులు పిరికిపందలు, నేరగాళ్లు అని దన్కర్ వ్యాఖ్యాలను రాహుల్ తప్పబట్టారు.
దేశంలో రైతులను పట్టించుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీ తరచుగా విదేశీ పర్యటనలు చేస్తున్నారని అయితే, కొన్నాళ్లుగా మోదీ దేశంలోనే ఉంటున్నారు... ఈ నేపథ్యంలో పంజాబ్ వెళ్లి రైతుల పరిస్థితిని ఓ సారి పరిశీలించాలని రాహుల్ గాంధీ... ఈ సందర్భంగా మోదీకి సూచించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యాలపై సభలో కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు, హర్సిమ్రత్ కౌర్ రాంవిలాస్ పాశ్వాన్ మండిపడ్డారు. గత పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.... ఆ సమయంలో రాహుల్ గాంధీ ఏ ప్రాంతానికి వెళ్లి రైతులను పరిశీలించారని హర్సిమ్రత్ కౌర్ ప్రశ్నించారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more