China | Traffic jam | high way | Accident

People enjoyed the tarffic jam in china

china, Traffic jam, Traffic, high way, national High ways, Police, Accident

When five car accidents blocked a busy highway in China, the drivers who were stuck in the traffic jam decided to hold an impromptu dance-off to pass the time. Authorities shut down the Chuda Highway in the country's south after a serious crash caused four others in the queuing traffic.

ట్రాఫిక్ జామ్ అయితే డ్యాన్సులే.. డ్యాన్సులు.. ఫుల్ ఎంజాయ్

Posted: 04/29/2015 01:56 PM IST
People enjoyed the tarffic jam in china

ట్రాఫిక్ జామ్.. ఎంతో చిరాకు తెప్పిస్తుంది. సిగ్నల్స్ దగ్గర గంటల కొద్ది వెయిటింగ్ చెయ్యడం.. ఏదో వెహికిల్ అడ్డం రావడంతో రోడ్డు మొత్తం ఆగిన వెహికల్స్ తో ఎంతో చికాకు పుడుతుంది. అందునా మన హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే మరీ నరకంగా ఉంటుంది. కానీ  ప్రతిదానిలో వెరైటీని ఆస్వాదించే వారికి మాత్రం ట్రాఫిక్ జామ్ కూడా జాలీగా అనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్ అయితే దాన్ని ఎంతో ఎంటర్ టెన్మెంట్ గా మార్చుకున్నారు కొంత మంది. రోడ్ల మీద డ్యాన్సులు చేస్తూ తాము హ్యాపీగా ఫీల్ అవడమే కాకుండా చాలా మందికి హ్యాపీనెస్ కలిగిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ అయితే చాలు ఎంటర్ టెన్మెంట్ చాలు అంటున్న ఆ కథ ఏంటో తెలుసుకుందామా..

చైనాలోని ఓ బిజీ హైవేలో యాక్సిడెంట్ అయింది. ఐదు కార్లు ఒకదాన్నొకటి ఢీ కొనడంతో భారీ ప్రమాదమే జరిగింది. దాంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. అది కూడా దాదాపు మూడు గంటల పాటు ఒక్క వెహికిల్ కూడా కదలలేని పరిస్థితి. దాంతో ట్రాఫిక్ పోలీసులు విషయాన్ని వివరించారు. సరే ఎలాగూ ముందుకూ వెళ్లలేం.. అలాగని వెనక్కి వెళ్లలేని పరిస్థితిలో ఉన్న వారికి ఓ ఆలోచన వచ్చింది. ట్రాఫిక్ జామ్ ను ఎంజాయ్ చెయ్యాలని వారు డిసైడ్ అయ్యారు. దాంతో వారు తమ వెహికిల్స్ లో ఉన్న టేప్ రికార్డులను ఆన్ చేసి పాటలకు స్టెప్పులేశారు. దాంతో మొత్తం హైవేపై ఆగిన వాహనదారులు కూడా ఇదే తరహాలో డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. మరి మన దగ్గర అయితేనా ట్రాఫిక్ జామ్ అయితే చిరాకు.. కోపం.. ఎంతైనా ఈ విషయంలో చైనా వాళ్లను చూసి నేర్చుకోవాల్సిందే.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china  Traffic jam  Traffic  high way  national High ways  Police  Accident  

Other Articles