Coal Scam: Court pulls up CBI for not seizing Naveen Jindal's passport

Why didnt you seize naveen jindal passport special court

coal scam, Naveen Jindal, Jindal Steel and Power (JSPL), India business report, Amarkonda Murgadangal, Coalgate, Naveen Jindalpassport, Special Court, CBI

A Special Court today rapped CBI for not impounding the passport of Congress leader and industrialist Naveen Jindal, chargesheeted along with 14 others in a coal block allocation scam case, saying the agency cannot adopt a different policy for some of the accused.

జిందాల్ పాస్ పోర్టు అంశంలో సీబిఐపై మండిపడిన న్యాయస్థానం

Posted: 04/30/2015 05:41 PM IST
Why didnt you seize naveen jindal passport special court

బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ వ్యవహారశైలిపై కేసు దర్యాప్తు చేస్తున్న సీబిఐ స్పెషల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన బోగ్గు కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న నవీన్ జిందాల్ పాస్ పోర్ట్ను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించింది. బొగ్గు కుంభకోణంపై గురువారం విచారణ సందర్భంగా ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, విచారణ జరుగుతున్నందున పాస్ పోర్టును సీజ్ చేయకూడదని నిర్ణయించుకున్నామని కోర్టుకు సీబీఐ తెలిపింది.

దీంతో పాస్ పోర్టులను స్వాధీనం చేసుకొనే విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో విధానం అనుసరించకూడదని సీబీఐకి కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో అందరికీ ఒకే సూత్రం వర్తించేలా విధానాన్ని రూపొందించాలని సీబీఐ డైరెక్టర్కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. బొగ్గు కుంభకోణంపై మే 6న అభియోగ పత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ప్రత్యేక కోర్టు ఈ సందర్భంగా తెలియజేసింది. దీంతో జిందాల్తో సహా 14మందిపై దాఖలైన ఛార్జ్షీటుపై మే 6న కోర్టు వాదనలు విననుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coal scam  naveen jindaal  special court  CBI  

Other Articles