పార్కింగ్ స్థలం కోసం గొడవ పడి, ఒక మహిళను మరో మహిళ పిడిగుద్దులు గుద్దిన ఘటనలో ఇద్దరు క్వీన్స్ మహిళలను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. వారిపై చట్టవిరుద్దంగా దౌరన్యానికి పాల్పడిన సెక్షన్ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఎప్పడు పిలిస్తే.. అప్పడు తమ ఎదుట హాజరయ్యేందుకు అంగీకరించడంతో వారికి డెస్క్ అపియరెన్స్ టిక్కెట్లు (బెయిల్) పై విడుదల చేశారు. పార్కింగ్ స్థలం కోసం జరిగిన గొడవ కాస్తా ముదిరి ఇద్దరు మహిళలు కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ వీడియో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... ఆదివారం రోజున వ్యాలీ స్ట్రీమ్ లోని గ్రీన్ ఎకర్స్ మాల్ ఎదుట పార్కింగ్ స్థలంలో 24 ఏళ్ల లటోయియా ఫ్రైడే తమ కారుని పార్క్ చేయడానికి వెళ్లింది. అయితే అదే స్థలంలో తమ వాహనాన్ని పార్క్ చేసుకుంటామని ఒక వ్యక్తి కారుని ఆపాడు. కారు దిగిన లటోయియా తనను ఆస్థలంలో ఎందుకు కారును పార్క్ చేయనివ్వలేదని అడిగింది.
దీంతో కారు పార్క్ చేసిన వ్యక్తి భార్య త్వానా మోరెల్.. లటోయియాతో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో ముందుగా రెచ్చిపోయిన లటోయియా ఫ్రైడే.. త్వానా మారెల్ తలపై బాదింది. అంతే ఇక కోపంతో ఊడిపోయిన త్వానా మారెల్.. తన భర్త, కుమారుడు చూస్తుండగానే సదరు మహిళని రోడ్డుపై పడేసి, మీద కూర్చొని ముఖం మీద పిడిగుద్దులు కురిపించింది. మరోవైపు భార్యను వారించాల్సిన భర్త కూడా మరింత కొట్టమని ప్రోత్సహించడంతో బాధితురాలిని చితక బాదింది. అడ్డుకోబోయిన మరో మహిళను కూడా భర్త నిలువరించారు. అమె ముందు తన భార్యపై దాడి చేసిందని చెప్పాడు. ఫ్రైడే తలను చితకబాదమని అమె తన నోటికి పనిచెప్పిందని భార్యను ప్రోత్సహించాడు. ఎట్టకేలకు ఇద్దరు మహిళను వచ్చి అడ్డుకున్న తరువాత కూడా భర్త నోరు తెరిచినందుకు తగిన శాస్తి జరిగిందా..? అంటూ ముక్తాయించడం కోసమెరుపు. చివరికి ఈ వీడియో బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు మహిళలను అరెస్టు చేసి, బెయిల్ పై వదిలారు. కాగా భర్తపై కేసు నమోదు విషయమై పోలీసులు పరిశీలిస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more