High court | Revacuation | Telangana

High court order to stop the revacuation hussain sagar

High court, Revacuation, Telangana, Hussian sagar, KCR, Hyderabad

High court order to stop the revacuation hussain sagar. The telangana govt decided to recaccuation the hussain sagar by this summer. But environmental societies oppose the telangana decision.

హుస్సేన్ సాగర్ ఖాళీని ఆపండి: హైకోర్ట్

Posted: 05/04/2015 10:53 AM IST
High court order to stop the revacuation hussain sagar

గత కొంత కాలంగా హైదరాబాద్ జపం చేస్తున్న కేసీఆర్ కు షాక్ తగిలింది. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా మారుస్తామని ముందు నుండి ఊదరగొడుతున్న కేసీఆర్ కు ఆటంకం ఎదురైంది. హుస్సేన్ సాగర్ ను ఖాళీ చేసి, కొత్తగా నీటిని నింపాలని ఆలోచిస్తున్న తెలంగాణ సర్కార్ కు అడ్డుపుల్ల పడింది. హుస్సేన్ సాగర్ నుంచి నీటి విడుదలను నిలిపివేయాలని చైన్నెలోని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ సదరన్ జోన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణాళిక లేకుండా సాగర్‌ను అశాస్త్రీయంగా ఖాళీ చేస్తున్నారని హైదరాబాద్‌కు చెందిన సేవ్ అవర్ అర్బన్ లేక్స్(సోల్) సంస్థ పిటీషన్ దాఖలు చేసింది. దాంతో పిటిషన్ పై స్పందించిన కోర్టు ఉత్తర్వులు ఇచ్చేవరకు పనులన్నింటిని ఆపాలని  ధర్మాసనం ఆదేశాలిచ్చింది. హుస్సేన్ సాగర్‌ను ఖాళీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అది అశాస్త్రీయమని, పూర్తి ప్రాజెక్టు నివేదిక లేకుండా ప్రజలతో సంప్రదింపులు జరపకుండా, తలెత్తే విపరిణామాలను ఆలోచించకుండా ఎలా చేస్తారని కొద్దికాలంగా సోల్ సంస్థ ఆందోళన చేస్తోంది.

ఒకవైపు హుస్సేన్ సాగర్‌లో ప్రమాదకర వ్యర్థాలున్నాయని నీరు తీవ్రంగా కలుషితమైందని నివేదికలు చెబుతుంటే శుద్ధి చేయకుండా నేరుగా మూసీలోకి వదులుతున్నారని, నీటిలోని జీవరాసులు పూర్తిగా చనిపోతాయని ఆ సంస్థ  పిటీషన్ దాఖలు చేశారు. ఈ చర్య పర్యావరణ చట్టం(1986), జల కాలుష్య నివారణ చట్టం(1974)తోపాటు జీవ వైవిధ్య చట్టం(2002)ను ఉల్లంఘించడమే అవుతుందని పిటీషన్‌లో పేర్కొన్నారు. దీనికి బాధ్యులుగా తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టీఎస్‌పీసీబీలను పేర్కొన్నారు. శుద్ధి చేయకుండా నీటిని వదలవద్దని, అది చేయకుండా కాలుష్య నియంత్రణ మండలిని పర్యవేక్షించేలా ఆదేశించాలని సోల్ వాదించింది. దీనిపై రెండ్రోజులపాటు వాదనలు విన్న ఇద్దరు సభ్యుల ధర్మాసనం తదుతరి ఉత్తర్వులు ఇచ్చే వరకు సాగర్ ఖాళీ చేసే పనులను నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు. తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా చేశారు. ఉత్తర్వుల కాపీలను సోల్ ప్రతినిధులు ఆయా ప్రభుత్వ విభాగాలతోపాటు గవర్నర్ నరసింహన్‌కు అందజేశారు.

 

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High court  Revacuation  Telangana  Hussian sagar  KCR  Hyderabad  

Other Articles