RTC, strike, Telangana, Mahender reddy,

Rtc strike getting problems to people

RTC, strike, Telangana, Mahender reddy,

RTC strike getting problems to people. By the strike even one rtc bus come on road. govt didnt positive on rtc strike.rtc employees demanding for fitment.

ఆర్టీసీ సమ్మె.. నరకం చూస్తున్న జనం

Posted: 05/06/2015 07:57 AM IST
Rtc strike getting problems to people

ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. డిపోలకే పరిమితమైన బస్సుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  మంగళవారం రాత్రి 9 గంటల వరకు చర్చలు కొనసాగినా, చర్చలు మాత్రం విఫలమయ్యాయి.  సంస్థ ఆర్ధిక పరిస్థితి వల్ల ప్రస్తుతం 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వలేమని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ఫిట్‌మెంట్‌పై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక వచ్చే వరకు వేచిచూడాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. తాము ప్రకటించిన విధంగానే సమ్మెలోకి వెళ్తామని తేల్చిచెప్పాయి. సంస్థ నష్టాలకు కార్మికులు కారణం కాదని తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి అశ్వద్ధరెడ్డి అన్నారు. సంస్థను తమకు అప్పగిస్తే మూడేళ్లలో లాభాల బాట పట్టించి చూపుతామన్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్లే సంస్థ నష్టాల్లోకి వెళ్లిందన్నారు. ప్రభుత్వం దిగివచ్చేవరకు సమ్మెను విరమించబోమని స్పష్టం చేశారు.


కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా, ఒక్క ఆర్టీసీ బస్సు కూడా రోడ్డెక్కలేదు. తాత్కాలికంగా డ్రైవర్లు,కండక్టర్లను నియమించాలని తెలంగాణ, ఎపి ఆర్టీసీ ఎమ్‌డిలు రమణారావు, సాంబశివరావు అధికారుల్ని ఆదేశించినా లాభం లేకుండా పోయింది.  హెవీ వెహికల్‌ లైసెన్స్‌ కల్గినవారు డిపోల్లో సంప్రదించవచ్చని సూచించారు. కండక్టర్‌ ఉద్యోగాలకు పదోతరగతి పాసైనవారు సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ ప్రకటించారు. డ్రైవర్లకు రోజుకు రూ.1000, కండక్టర్లకు రూ.800 ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఆర్టీసీ ఉద్యోగులు బస్సులను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. దాంతో బస్సులు కేవలం డిపోలకే పరిమితమయ్యాయి. అయితే ఒక్క సారిగా ఆర్టీసీ బంద్ తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ సహా పలు మెట్రో నగరాల్లో ప్రజలు చుక్కలు చూస్తున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతొ.. ప్రజలకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఎలాంటి అసౌర్యాలకు గురికాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అంటున్నా.. పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆర్టీసీ సమ్మె ప్రజా జీవనాన్ని అస్థవ్యస్తం చేస్తోంది. మరి ప్రభుత్వం దీనిపై ఇప్పటికైనా చర్చలు జరిపి.. సమ్మె విరమింపజేయాలని కోరుతున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RTC  strike  Telangana  Mahender reddy  

Other Articles