RTC, Sambashiva rao, demand, Fitment,

Rtc md sambashiva rao fire on rtc unions for strike

RTC, Sambashiva rao, demand, Fitment, RTC, Sambashiva rao, demand, Fitment,

Rtc md sambashiva rao fire on rtc unions for strike. RTC employees demanding for fitment as govt employees. But rtc managment slams the rtc employees demand.

ఆస్తులు అమ్మి ఫిట్ మెంట్ ఇవ్వాలా?.. ఆర్టీసీ ఎండీ ఘాటు మాటలు

Posted: 05/06/2015 08:08 AM IST
Rtc md sambashiva rao fire on rtc unions for strike

ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ లపై ముందు నుండి అనుకూలంగా లేని ప్రభుత్వం చర్చల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆర్టీసీ కార్మికులకు ఆగ్రహం తెప్పించాయి. ఆర్టీసీ ఆస్తులు అమ్మి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలా? అలాంటి చరిత్ర సంస్థలో లేదు అంటూ ఆర్టీసీ ఎండీ చేసిన వ్యాఖ్యలు అక్కడ చర్చలకు వచ్చిన కార్మిక సంఘం నేతలకు ఆశ్చర్యాన్ని కలిగించాయి.  ఇప్పటికే సంస్థ నష్టాల్లో ఉంది. కేబినెట్‌ సబ్‌కమిటీ నిర్ణయం వెలువడేదాకా వేచి ఉండాలని,  కార్మిక సంఘాలు అర్ధం చేసుకోవాలని ఆయన అన్నారు.  15 శాతం ఛార్జీల పెంపును రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదించామని,  వాటిద్వారా వచ్చే రూ.750 కోట్లను కార్మికుల ఫిట్‌మెంట్‌కే ఖర్చు చేస్తామని ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నండూరి సాంబశివరావు అన్నారు.

ఆర్టీసీ కార్మికులకు గతంలో ప్రకటించిన 27 శాతం మధ్యంతర భృతిని ఫిట్‌మెంట్‌గా మార్చడానికి అంగీకరించామని, దీనివల్ల సంస్థపై ఏటా రూ.850 కోట్ల అదనపు భారం పడుతుందని ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నండూరి సాంబశివరావు అన్నారు.  ఇరు రాష్ట్రాల్లోనూ రెండేళ్ల నుంచీ ఛార్జీలను సవరించలేదన్నారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేశామని, త్వరలోనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆమోదం తెలుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 27 శాతం మధ్యంతర భృతి వల్ల రూ.400 కోట్ల భారం పడిందని, దీన్ని ఫిట్‌మెంట్‌గా బదలాయిస్తే భారం రూ.850 కోట్లకు చేరుకుంటుందన్నారు.

ఆర్టీసీ చర్చల్లో ఆర్టీసీ యాజమాన్యం మాటలు..
*ఫిట్‌మెంట్‌ను ఎగ్గొట్టాలన్న అభిప్రాయం లేదన్నారు.
*ఫిట్‌మెంట్‌పై చర్చల కోసం మరో 30-40 రోజులు గడువు కావాలని కార్మిక సంఘాలను కోరాం..
*తమ వినతిని పట్టించుకోని కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయన్నారు.
*నష్టాలకు తాము బాధ్యులం కాదని, కార్మిక సంఘాలు చెబుతున్నాయని,
*ఫిట్‌మెంట్‌ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ
*ఉపసంఘం ఆర్టీసీకి ఉన్న ఆస్తులను ఆమ్ముకుని ఫిట్‌మెంట్‌ ఇవ్వమంటోంది.
*అప్పులు తీసుకుని ఇవ్వమని చెబుతుందో వేచి చూడాలన్నారు. '2013-14లో రూ.690 కోట్లు, 2014-15లో రూ.560 కోట్లు నష్టం వచ్చింది.
*పాతికేళ్లలో 19 సంవత్సరాలు సంస్థకు నష్టాలు వచ్చాయి.
*సంస్థకు రోజువారీ ఆదాయం రూ.11 కోట్లు. వారం రోజులుగా రూ.14 కోట్లు వస్తోంది. రోజూ రూ.2 కోట్లు అదనంగా వస్తోంది.

//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RTC  Sambashiva rao  demand  Fitment  

Other Articles