after days livein relationship lover goes missing

Young man missing in miss call love story

young man missing in miss call love story, after six months relationship lover goes missing, liveinhood relationship arakonda, gollapalli, palamaneru, peddapanjani, icds police, madenapalli child home, parents not accepting their daughter, prem kumar

young man goes missing after six months liveinhood relationship with lover

మిస్ కాల్.. ప్రేమ బాసలు.. సహజీవనం....?

Posted: 05/08/2015 10:31 PM IST
Young man missing in miss call love story

కన్నవారిని వున్నఊరును ఓ ఫోన్ కాల్.. కాదుకాదు ఒక్క మిస్డ్ కాల్ దూరం చేసింది. అభం శుభం తెలియని అమ్మాయి అందరూ వున్నా అనాధా మారింది. ఎలా అంటారా..? అమ్మాయి అతంగా చదువు కోకపోవడమే ఇందుకు కారణమా..? ఇలా ఎన్నో ప్రశ్నలు.. అయితే ఇదే మనకు తెలిసిన వారికి వస్తే.. ఎంత కష్టం..? ఇది ఒక అమ్మాయి జీవితం..? ఇక అమ్మాయి ఏం చేయాలి..? ఎలా బతకాలి..? ఎప్పటికైనా తమ తల్లిదండ్రులు అమెను అదరిస్తారా..? అమెను కష్టాల కడలిలో ముంచి అవసరం తీర్చుకుని వెళ్లిపోయిన వాడు వస్తాడా..? తాళి కట్టి బాగస్వామిని చేసుకుంటాడా..? అన్ని ప్రశ్నలే వేస్తున్నారంటారా..?

పెద్దపంజాణి మండలంలోని పోలేపల్లె గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి ఆరో తరగతి వరకూ చదువుకుంది. అయితే అమెకు ఆరు నెలల క్రితం ఆమె ఫోన్‌కు ఒక మిస్ కాల్ వచ్చింది. ఆ నంబర్‌కు ఆమె తిరిగి ఫోన్ చేసింది. అరగొండకు సమీపంలోని గొల్లపల్లె గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్‌తో పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 25 రోజుల క్రితం ఒకరినొకరు కలుసుకుని పెళ్లి చేసుకోవాలని ఇళ్ల నుంచి రహస్యంగా పారిపోయి వచ్చి, పలమనేరు లో కలుసుకున్నారు. అక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. 20 రోజుల పాటు ఇద్దరూ పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేశారు. ఐదు రోజుల క్రితం ప్రేమ్‌కుమార్ విజయవాడలో ఉద్యోగం కోసం వెళుతున్నానని, ఈనెల 15వ తేదీన తిరిగి వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి, జారుకున్నాడు.

అద్దె డబ్బులు ఇవ్వలేదని ఇంటి యజమాని ఇల్లును ఖాళీ చేయమన్నాడు. దీంతో ఆ యువతి ప్రేమ్‌కుమార్‌కు ఫోన్ చేయగా నీవు పుట్టింటికి వెళ్లాలని, తాను విజయవాడ నుంచి రాగానే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతని మాటల్లో నిజం లేదని గుర్తించిన ఆ యువతి బుధవారం రాత్రి పలమనేరు పోలీసులను ఆశ్రయించిం ది. అయితే పెద్దపంజాణి మండలానికి సంబంధించిన కేసు అయినందున అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించగా పెద్దపంజాణికి చేరుకుంది. ఈ విషయాన్ని పెద్దపంజాణి పోలీసులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

బాధితురాలి కుటుంబ సభ్యులను సంప్రదించగా తమను కాదని వెళ్లిన అమ్మాయి తమకు అక్కర్లేదని, తమ ఇంటికి రానివ్వమ్మని తెగేసి చెప్పేశారు. దీంతో చేసేది లేక ఐసీడీఎస్ అధికారులు మదనపల్లెలోని చైల్డ్ హోంలో ఉంచి, గురువారం ఉదయం అమ్మాయి ని పోలేపల్లెకు తీసుకెళ్లారు. ఆ యువతి కుటుంబ సభ్యులను పలకరించగా ముందు రోజు చెప్పిన మాటే మళ్లీ చె ప్పారు. చేసేది లేక పెద్దపంజాణి పోలీస్ స్టేషన్‌లో నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. పోలీసులు రెండు రోజులు గడువు కోరడంతో బాధితురాలిని తిరిగి మదనపల్లెలోని చైల్డ్ హోంకు తరలించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్, ఏసీడీపీవో ఎల్లమ్మ,  సూపర్‌వైజర్ సులోచన  పాల్గొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICDS police  Phone  Love  Peddapanjani  prem kumar  

Other Articles